​గాంధీ ఆస్పత్రిలో ఘోరం !

June 04, 2020

ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకుని మన పంచాయతీ కార్యాలయం వరకు అందరూ సామాజిక దూరం పాటించమని మొత్తుకుంటుంటే... అన్నిటిని ఉల్లంఘించి సమాజానికే హానికరంగా తబ్లిగి జమాతీ సృష్టించిన మారణహోమాన్ని గమనించాం. తబ్లిగి జమాత్ వల్ల దాదాపు అంతరిస్తోందనుకుంటున్న కరోనా జడలు విప్పింది. వీరి చర్యలపై దేశంలోని అన్ని మతాల వారు తీవ్రంగా ఆగ్రహించారు. ఈ దేశానికి హానికరంగా ప్రవర్తించే ఏసమూాహానికి అయినా శిక్ష పడక తప్పదు అని నినదిస్తున్నారు. ఇతరు మతాల వారు ఏకమై ఇపుడు ముస్లింలను తప్పు పడుతున్నారు. తబ్లిగి జమాత్ కు హాజరైనందుకు కాదు... ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు చేస్తాం రమ్మంటే దాక్కుంటున్నందుకు? 

ఉచిత చికిత్సలు చేస్తాం అన్నా కూడా దాక్కోవడంలో వారి ఉద్దేశమేంటి? టెస్టుల కోసం ఆయా కాలనీలకు వెళ్తున్న మెడికల్ సిబ్బందిపై పెద్ద ఎత్తును మసీదుల నుంచి పిలుపు ఇచ్చి దాడికి పాల్పడమని చెప్పడం ఏంటి (ఇది ANI రిపోర్ట్ చేసింది కర్ణాటకలో జరిగింది). వారి ఉద్దేశం ఏంటి? దేశాన్ని ఏమైనా చేయడానికి వారు కంకణం కట్టుకున్నారా? ఎందుకు పరీక్షలకు రాకుండా దాక్కుంటున్నారు? 

ఇదంతా ఒకెత్తు అయితే... తాజాగా గాంధీ ఆస్పత్రిలో వీరిని తీసుకెళ్లి క్వారంటైన్ లో ఉంచితే... అక్కడ మళ్లీ అందరూ కలిసి సామూహిక నమాజ్ చేస్తున్నారు. ప్రాణాలకు పణంగా పెట్టి వైద్యులు, పోలీసులు పోరాడుతుంటే... ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తుంటే వీరు క్షమించరాని విధంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో అన్ని మతాల ప్రార్థనలు, పూజలు రద్దుచేశారు. లక్షల మంది హాజరయ్యే భద్రాచలం, శ్రీశైలం, తిరుమల క్షేత్రాల్లోను ఎవరినీ రానివ్వడం లేదు. కేవలం  పూజలు మాత్రం అతి కొద్దిమంది చేత చేయిస్తున్నారు. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ... కానీ గాంధీ ఆస్పత్రిలో ఉన్న కొందరు ముస్లింలు ఈ సామూహిక నమాజ్ లు చేసుకోవడాన్ని అస్సలు అనుమతించకూడదు. ఇది పూర్తిగా లాక్ డౌన్ ఉల్లంఘనే ! ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి.