ముస్లిం....పుట్టావా? ల‌....కొడ‌కా?-మంత్రి బొత్స

June 01, 2020

శాస‌న మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ని దుర్భాష‌లాడిన మంత్రి బొత్స


చైర్మ‌న్‌పై మంత్రుల దౌర్జ‌న్యాన్ని ఫోటో తీయ‌బోయిన లోకేశ్‌పై మంత్రుల దాడి


మ‌హ్మ‌ద్ షరీఫ్ గారిని చూడ‌గానే చేతులెత్తి స‌లామాలేకుం అని న‌మ‌స్కారం చేయాల‌నిపిస్తుంది. ఆయ‌న శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ అయ్యాక ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ్వ‌రి ప‌ట్ల ప‌రుషంగా కూడా మాట్లాడిన సంద‌ర్భం లేదు. అయితే మూడు రాజ‌ధానుల బిల్లు మండ‌లిలో ఎలాగైన ఒడ్డెక్కించుకోవాల‌ని మొహ‌రించిన మంత్రులు ష‌రీఫ్ గారిని నానా దుర్భాష‌లాడారు. ఒకానొక ద‌శ‌లో చైర్మ‌న్ కుర్చీ ద‌గ్గ‌ర‌కు చేరిన మంత్రి బొత్స ``ముస్లిం....కేపుట్టావా? ల‌....కొడ‌కా?`` అంటూ దూషించారు. అయితే ష‌రీఫ్ గారు నియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కే తాను ప‌నిచేస్తాన‌ని ప్ర‌శాంతంగా బ‌దులిచ్చారు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన బొత్స చైర్మ‌న్‌పైనే దాడికి ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌కు మ‌రికొంత మంది మంత్రులు తోడ‌య్యారు. శాస‌న మండ‌లిలో జ‌రుగుతున్న ఈ అరాచ‌కాలు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా క‌రెంట్ క‌ట్ చేశారు. లైవ్ ఆపేశారు. స‌భ్యుల ద‌గ్గ‌ర ఫోన్లూ లాక్కున్నారు.

అయితే సాక్షాత్తు చైర్మ‌న్‌పై దాడికి మంత్రులు తెగించ‌డంతో ఎమ్మెల్సీ నారా లోకేశ్ వాటిని ఫోటోలు తీయాల‌ని ప్ర‌య‌త్నించారు. లోకేశ్ ఫోన్ లాక్కుని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్‌లు ప్ర‌య‌త్నించారు. అయినా చివ‌రికి చైర్మ‌న్ ష‌రీఫ్ స‌భానియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కు బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టివ‌ర‌కూ చైర్మ‌న్‌ని ప‌లుర‌కాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విర‌చుకుప‌డ్డారు. అయితే ఏ ద‌శ‌లోనూ సంయ‌మ‌నం కోల్పోని చైర్మ‌న్ ష‌రీఫ్ సాబ్ ఎవ్వ‌రినీ ప‌ల్లెత్తు మాట కూడా అన‌కుండానే త‌న విధులు నిర్వ‌ర్తించుకుని చాంబ‌ర్‌కి వెళ్లిపోయారు.

రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌వి అయిన శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌, ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మ‌చ్చ‌లేని సీనియ‌ర్ నాయ‌కుడు అయిన మ‌హ్మ‌ద్ ష‌రీఫ్‌ని ఇంత‌లా అవ‌మానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, నేత‌లు త‌మ‌కు ముస్లింల ప‌ట్ల ఉన్న‌ది స‌వ‌తి ప్రేమే అని మ‌రోసారి నిరూపించుకున్నారు.