ప్రతి మనిషి కచ్చితంగా చదవాల్సిన పాయింట్లివే

August 11, 2020

ప్రపంచ దేశాల్లో కరోనా జాగ్రత్త చర్యల్లో ఒక్కటి తప్ప అన్నింట్లో మన దేశం ముందుంది. కానీ ఒక్క విషయం ఇగ్నోర్ చేయడంతో ఇపుడు ఇండియా దాని బారిన పడింది. ఇంటర్నేషనల్ ఎపుడైతే కరోనా చైనా నుంచి మరో దేశానికి వ్యాపించిందో అదే రోజు విదేశాలనుంచి మనదేశానికి విమానాలు పూర్తిగా బంద్ చేయాల్సింది. మన వాళ్లు అక్కడుంటే మన వైద్యులను పంపో, మన డబ్బులు పంపో అక్కడ వైద్యం చేయించాల్సి ఉండింది. కానీ అక్కడ మిస్సయ్యాం. ఆ తర్వాత ఢిల్లీలో స్క్రీనింగ్ మొదలుపెట్టారు. ఢిల్లీలో ఒకటి పెడితే సరిపోదు కదా... దేశంలోని ఇతర విమానాశ్రయాలను వదిలేశారు. అందుకే ఇటలీ నుంచి వచ్చిన వాడు బెంగుళూరులో దిగి తెలంగాణకు కరోనా అంటించాడు. ఈరోజు మన లెక్క సుమారు 16. కానీ ఇప్పటికీ అంతర్జాతీయ సరిహద్దులు మూసేయలేదు. ఇంకా మూసేస్తాం అంటున్నారు. కానీ వ్యాధి మన వద్దకు వచ్చేసింది. మనవాళ్లలో కొంచెం గుడ్డి ధైర్యం ఎక్కువ. బాధ్యతరాహిత్యం కూడా ఎక్కువే. అందుకే తమ అయాకత్వంతో ఇతరులకు అంటిస్తారు. తాజాగా పంజాబ్ లో 160 మంది తప్పించుకుతిరుగుతున్నారట. క్వారంటైన్ లో ఉండమన్నది వారిలా చేశారు. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కోల్ కతా నగరం అంతా చుట్టేశాడు... ఇపుడు ఆ నగరం వణుకుతోంది. అసలు మొదట్లోనే విమానాలు ఆపేసి ఉండి ఈరోజు దేశం ఏడ్చేది కాదు. 

 

జరిగింది జరిగిపోయింది

బాధపడితే ప్రయోజనం లేదు. 

ఇపుడు ఏం చేయాలో అది చూడాలి

ఈరోజు పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం ఎలా చేస్తున్నామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్నారు. కరోనా వైరస్ ప్రపంచమంతటికీ వ్యాపిస్తోందన్న వార్తలను గత రెండు నెలలుగా మనమంతా ఆందోళనతో గమనిస్తున్నామన్నారు. మానవాళిని సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్నామని, ప్రపంచం గందరగోళంలో ఉందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంనాటి పరిస్థితులు నేడు ఉన్నాయన్నారు. మీ సహకారం అవసరం, మనమంతా కలిసికట్టుగా దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు.

కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్లు లేవని, చాలా పరిశోధనలు చేసినప్పటికీ సత్ఫలితాలు రాలేదని చెప్పారు. ఎపుడు వస్తాయో చెప్పలేం అన్నారు. ఈ వైరస్ బాధితులను ఏకాంత ప్రదేశంలో ఉంచి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. దయచేసి దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. మనమంతా గట్టి సంకల్పం పెట్టుకోవాలి. చిత్తశుద్ధితో ఎదుర్కొనాలన్నారు. దీటుగా ఎదుర్కొనగలమనే నమ్మకమే మనల్ని గెలిపిస్తుందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనడం, తిప్పికొట్టడం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కృషితోపాటు ప్రతి ఒక్కరి సంకల్పంతో ఇది సాధ్యమవుతుందని మోడీ అన్నారు.

సామాజికంగా కట్టుబాట్లతో వ్యవహరించాలని పేర్కొన్నారు.  అనారోగ్యంగా ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు జనంలో తిరిగితే, తమకు తామే అన్యాయం చేసుకున్నవారు అవుతారని, అంతేకాకుండా తమ కుటుంబాలకు, యావత్తు సమాజానికి అన్యాయం చేస్తున్నట్లేనని వివరించారు. ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఎవరూ తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావొద్దని చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాలన్నారు. రాబోయే కొద్ది రోజులపాటు చాలా ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని తెలిపారు. ''నేను బాగున్నాను, నాకేమీ జరగదు'' అనుకోవడం తప్పు అని చెప్పారు. మన శుభ్రత, మన జాగ్రత్త మనకు శ్రీరామరక్ష అన్నారు. 

 

సరే మోడీ చెప్పాల్సింది చెప్పారు. మనం చేయాల్సింది ఏంటి? 

1. పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి.
2. సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి.
3. ఒక నెల రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఊ వినియోగించ కండి.
4. ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి.
5. ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి.
6. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి.
7. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి.
8.జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి.
9. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి.
10. అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు.
11. పనిమనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి.
12. అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి.
అవకాశం ఉన్నంత మేరా ఈ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయండి.