కరోనా, కోవిడ్-19ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

August 07, 2020

కరోనా...కోవిడ్-19....ప్రస్తుతం ఈ రెండు పదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. కరోనా బారిన పడి కరోనా, కోవిడ్-19 గురించి తెలుసుకోవడానికి ప్రజలు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. చాలా మంది ప్రజలకు కరోనా, కోవిడ్-19 గురించి అనేక సందేహాలున్నాయి. కరోనా, కోవిడ్-19 ఒకటేనా? కోవిడ్-19 అంటే ఏమిటి? అది ఎలా వ్యాప్తి చెందుతుంది? కోవిడ్-19 బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్-19 బారిన పడిన వారంతా చనిపోతారా? అన్న ప్రశ్నలు చాలా మందికి ఉత్పన్నమవుతుంటాయి. అందుకే, నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం కరోనా, కోవిడ్-19 కుసంబంధించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన సమాధానాలు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

1) What is COVID-19?

కరోనా వేరు కోవిడ్-19 వేరు. కరోనా వైరస్ కలిగించే వ్యాధి పేరు COVID-19. డిసెంబరు, 2019లో చైనాలోని వుహాన్ నగరం‌లో తొలిసారిగా ఈ వ్యాధి బయటపడింది.

2) How does COVID-19 spread?

కోవిడ్-19 అనేది అంటువ్యాధి. కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లు ఏవైనా వస్తువులపై లేదా రోగి చుట్టూ మాత్రమే ఉంటాయి. ఇతరులు ఆ వస్తువులను లేదా కోవిడ్-19 సోకిన వ్యక్తి దగ్గరికి వచ్చి తాకిన తర్వాత...తన కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం ద్వారా వారికి ఈ వైరస్ సోకుతుంది. అందుకే కోవిడ్-19 సోకిన వ్యక్తి నుండి 1 మీటర్ (3 అడుగుల) కు పైగా దూరంలో ఉండాలి.

3) What are the symptoms of COVID-19?

జ్వరం, అలసట మరియు పొడిదగ్గు. ఒళ్లు నొప్పులు, జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, డయేరియా వంటివి కోవిడ్-19 యొక్క సాధారణ లక్షణాలు. కొంతమందిలో ఈ వైరస్ ఉన్నప్పటికీ పై లక్షణాలేవి కనిపించకుండా సాధారణంగానే కనిపిస్తారు. 80 శాతానికి పైగా రోగులు ఎటువంటి ప్రత్యేక వైద్యాన్ని తీసుకోకుండానే కోవిడ్-19 నుంచి బయటపడతారు. కోవిడ్ -19 సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. శ్వాస కోస సంబంధ వ్యాధులతో బాధపడేవారు కోవిడ్-19 బారినపడితే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. వృద్దులు మరియు హై బీపీ,గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.

4) Can COVID-19 be diagnosed?

కొన్ని రకాల పరీక్షల ద్వారా కోవిడ్-19ను నిర్ధారించవచ్చు. కోవిడ్-19 టెస్ట్‌లో భాగంగా ముందుగా మీ గొంతు మరియు నాసికలను పరీక్షిస్తారు. గొంతులోని లాలాజలం సాంపిల్స్‌ను తీసుకొని పరీక్షించి కోవిడ్-19 సోకిందో లేదో నిర్ధారిస్తారు. ఫలితం వచ్చేవరకు హోమ్ ఐసోలేషన్ (గృహ నిర్బంధం) లేదా క్వారంటైన్ సెంటర్లో ఉండమని చెప్తారు. టెస్ట్‌లో పాజిటివ్ వస్తే, కనీసం 14 రోజులు, లేదంటే పూర్తిగా తగ్గేంతవరకు క్వారంటైన్ లేదా ఐసోలేషన్ లో ఉండాలి.

5) How can one avoid catching or spreading Coronavirus?

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటిని ఉపయోగించి తరచుగా చేతులను కడుక్కోవడం ద్వారా చేతులపై ఉన్న వైరస్‌లు చనిపోతాయి. దగ్గుతున్న లేదంటే తుమ్మతున్న వారి నుండి కనీసం 1 మీటర్ (3 అడుగుల) దూరంలో ఉండండి. మీరు మరియు మీ చుట్టూ ఉన్నవారు పరిశుభ్రత పాటించేటట్లు చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవడం. తరువాత టిష్యూ పేపర్‌ను క్లోజ్ చేసే వీలున్న డస్ట్‌బిన్‌లో వెయ్యండి. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే డాక్టర్‌ను వెంటనే సంప్రదించండి. లక్షణాలు గుర్తించిన వెంటనే, లేదా లక్షణాలు లేకుండానే కోవిడ్-19 సోకిందేమో అన్న అనుమానం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ప్రభుత్వ అనుమతితో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు తప్పకుండా హోమ్ క్వారంటైన్ పాటించడం ద్వారా కూడా ఇతరులకు వైరస్ సోకకుండా నివారించవచ్చు.

6) Coronavirus Does and Donts

Does- బయటకు వెళ్లేటపుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.  తీసేసిన మాస్క్‌ని వెంటనే చెత్తకుండిలో పారేయండి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. శానిటైజర్, లేదా హ్యాండ్ వాష్ తో చేతులు తరచు శుభ్రపరుచుకోవాలి. వ్యాధి లక్షణాలు  కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. సీ విటమిన్ అధికంగా ఉండే మంచి ఆహారం తీసుకోండి.

Donts-

మాస్క్ లేకుండా బయటకు వెళ్లొద్దు. మాస్క్ వాడిన తర్వాత దాని మధ్యభాగంలో పట్టుకోవద్దు. తీసేసిన మాస్క్‌ని మరలా వాడొద్దు. మాస్క్‌ తీసిన తర్వాత చేతులని శుభ్రంగా ఆల్కహాల్ బేస్డ్ వాష్‌తో, సబ్బుతో కానీ శుభ్రం చేసుకోకుండా దేనినీ ముట్టుకోవద్దు. షేక్ హ్యాండ్ చేయొద్దు.  మీ కళ్ళను, ముక్కును మరియు నోటిని తరచుగా తాకొద్దు. ఉడకని మాంసం, పచ్చి మాంసం తీసుకోకపోవడం మంచిది.

7) Is there any treatment for coronavirus?

కోవిడ్-19 కు సంబంధించి వాక్సిన్ మరియు మందులు లేదా చికిత్స లేవు. అయితే, వ్యాధి సోకిన వారికి, వ్యాధి లక్షణాలకు సంబంధించిన చికిత్స చేస్తారు. తీవ్ర అనారోగ్య లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పిటల్‌లో చేరాలి. తగు రక్షణ చర్యల వల్ల చాలా మందికి నయం అవుతోంది.

8) Can pets catch coronavirus?

సాధారణంగా పెంపుడు జంతువులు...అంటే కుక్కలు, పిల్లులకి కోవిడ్-19 సోకే అవకాశాలు చాలా అరుదు. అయితే, హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు బలహీనమైన కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించి క్వారంటైన్ లో పెట్టారు.

9) Where can I get tested?
కోవిడ్-19లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వం సూచించిన నంబర్లకు ఫోన్ చేయాలి. ప్రభుత్వ, వైద్య సిబ్బంది అనుమానితులను హాస్పిటల్స్‌కు చేరవేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం నిర్దేశించిన ల్యాబ్ లలో ఉచితంగా కోవిడ్-19 టెస్టులు చేస్తారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్ లకు కూడా కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

10) Who is at more risk?

వృద్దులు, పదేళ్లలోపు వయసున్న చిన్న పిల్లలు మరియు ఇదివరకే శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నవారు, హై బీపీ, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, కాన్సర్ లేదా మధుమేహం వంటివి ఉన్న వారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.  

11) Can pregnant women and children catch coronavirus?

 రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా గర్భిణులు ఈ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కరోనా వైరస్ ప్రభావం గర్భవతుల మీద తీవ్రంగా ఉంటుంది.

12) Difference between Coronavirus and COVID19

కరోనా వేరు కోవిడ్-19 వేరు. భూమి మీద ఉన్న చాలా వైరస్‌లలానే కరోనా వైరస్ జంతువులకు మరియు మనుషులకు హాని కలిగిస్తుంది. కరోనా వైరస్ కలిగించే వ్యాధి పేరు COVID-19. ఈ కరోనా వైరస్‌లు సాధారణ జలుబు మొదలుకొని ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిటరీ సిండ్రోమ్ (MERS) మరియు సెవర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ (SARS) వంటి వ్యాధులను మానవులకు కలిగిస్తాయి. అందుకే దీనిని సార్స్ కోవిడ్-19 అంటారు. 2003 లో వచ్చిన సెవర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ (SARS) యొక్క కారకాలు, కోవిడ్-19 కారకాలు ఒకే జన్యుజాతికి సంబంధించినప్పటికీ అవి కలగజేసేవ్యాధులు వేరే. కోవిడ్-19 తో పోలిస్తే SARS తక్కువగా ఇతరులకు సోకుతుంది.