మై హోమ్ రామేశ్వరరావు భారీ సర్ ప్రైజ్ !

June 04, 2020

మై హోం రామేశ్వరరావు ఎవరు? కేసీఆర్ ఆప్త మిత్రుడు. వ్యాపారి. ప్రీమియం రియల్ ఎస్టేట్ లో హైదరాబాదు మహానగరంలో చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఆయన భారీ విరాళం (మనకు భారీ గాని... ఆయన దృష్టిలో రెండు లగ్జరీ ఫ్లాట్లు అమ్మితే వచ్చేడబ్బు) ప్రకటించారు. ఈ విషయం చెప్పిన వెంటనే తుడుముకోకుండా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చి ఉంటాడని చెప్పేస్తారు కదా మీరు. మీరు కరోనాలో కాలేశారు. అవును... అదే కదా సర్ ప్రైజ్. మొత్తం వ్యాపారమంతా తెలంగాణలో చేసే మైహోం రామేశ్వరరావు తెలంగాణకు 3 కోట్ల విరాళం ఇచ్చారు. అంతే మొత్తం ఏపీ సీఎంకి ఇచ్చారు. ఒకవేళ ఏపీకి ఇచ్చినా తెలంగాణ కంటే తక్కువే ఇస్తారనే అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఇచ్చారు రామేశ్వరరావు.

అయితే, దీని వెనుక కథ ఏంటంటే... రామేశ్వరరావు వ్యాపారాలు తెలంగాణలోనే అయినా జగన్ అండదండలు ఆయనకు, ఆయన సహకారం జగన్ కు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అటు బెంగుళూరు వ్యాపారంలోను సయోధ్య ఉందని చెబుతుంటారు. అందుకే ఏపీలో పెద్దగా ఏ ప్రాజెక్టు లేని రామేశ్వరరావు ఏపీకి తెలంగాణతో సమానంగా విరాళం ఇచ్చారు. 

బహుశా... ఇది ఏపీలో ఎంట్రీకి రహదారి వేసుకున్నట్టు అనికూడా చెప్పొచ్చు. రాబోయే కాలంలో విశాఖలో విరివిగా మై హోం అపార్ట్ మెంట్లు మనకు కనిపించినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కుంది. మన మిత్రులు ఉన్నచోట కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. వ్యవహారం చాలా వ్యూహాత్మకంగా నడుస్తుందన్నమాట. 

Photo: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం ఇచ్చిన మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ జె.రంజిత్‌ రావు.