నా మొగుడు బోర్ కొడుతున్నాడు

December 14, 2019

టాలీవుడ్లో లేటెస్ట్ స్వీటెస్ట్ క‌పుల్ గా నాగ‌చైత‌న్య‌-స‌మంత అల‌రిస్తున్నారు. వారిద్ద‌రికీ పెళ్ల‌య్యి అపుడే ఏడాదైపోయింది. కానీ కెరీర్‌ను ఏ మాత్రం డిస్ట‌ర్బ్ చేసుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఇద్ద‌రు క‌లిసి ముచ్చ‌ట్లు చెప్పారు. ఒక‌రిపై ఒక‌రు రొమాంటిక్ తిట్లు తిట్టుకుంటూ, నింద‌లు వేసుకుంటూ గ‌డిపేశారు.
ఈ సంద‌ర్భంగా వారి ప్రేమ‌కోప‌తాపాలు వైర‌ల్ అయ్యాయి. స‌మంతకి పొసెసివ్‌నెస్ ఎక్కువ‌. నేను ఎక్క‌డికి వెళ్లాను, ఎవ‌రిని క‌లిశాను, ఏం చేస్తున్నాను అని ట్రాక్ చేస్తుంటుంది... అంటూ ఆమెను ఇరికించాడు. దీంతో స‌మంత‌కు చిర్రెత్తుకువ‌చ్చింది.
నా చైతు...బోర్ కొడ‌తాడు. వెరీ బోరింగ్ అని సెటైర్ వేసింది. చైతూ స్పందిస్తూ పెళ్లి జ‌రిగిన కొత్త‌లో అంతా ఎగ్జ‌యిటింగ్‌గా ఉండేది. ఇపుడు ఇలా ఉంది అంటూ న‌వ్వాడు. అయినా సాధార‌ణంగా పెళ్లి సెవెన్ ఇయ‌ర్స్ ఇచ్ అంటారు. వీరికి ఆ ఇచ్ వ‌న్ ఇయ‌ర్‌లోనే పోయిన‌ట్టుంది అనుకోవాలేమో ప్రేక్ష‌కులు.
ఏదేమైనా స‌మంత చిలిపిత‌నంతో నాగ‌చైత‌న్య ఎన్నేళ్ల‌యినా గ‌డ‌పొచ్చు. స‌మంత ఈనాటి హీరోయిన్ల‌లోనే కాదు, ప‌ర్స‌న‌ల్‌గా కూడా చాలా డిఫ‌రెంట్ మ‌నిషి. ఆమె కొంటెత‌నానికి తెలుగులో ఫ్యాన్స్ బాగా ఎక్కువ‌. అందుకే ఆమెకు చైతు బోర్ కొడ‌తాడేమో గాని చైతూకి ఆమె బోర్ కొట్ట‌దు.
వీరిద్ద‌రు పెళ్లి త‌ర్వాత తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. ఆ సినిమా ‘మజిలీ’. ఏప్రిల్ 5న విడుదలట‌. ఇందులో మ‌రో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ కూడా న‌టిస్తోంది.