అయ్యో.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో క‌ళ త‌ప్పింది

June 04, 2020

అదేంటి.. ఏమైంది అయినా ఆందోళ‌న చెంద‌కండి. ప్ర‌స్తుతానికి ఒక టెంప‌ర‌రీ బ్యాడ్ న్యూస్ ఇది. జ‌బ‌ర్ద‌స్త్ షో తెలుగులో న‌వ్వులు పూయించ‌ని ఇల్లు లేదు. అన్ని వ‌ర్గాల్లో సూప‌ర్ హిట్ అయిన ఏకైక తెలుగు టీవీ షో జ‌బ‌ర్ద‌స్త్‌. దానికి ఉన్న క్రేజ్ మ‌రే టీవీ షోకు తెలుగు ఇంత‌వ‌ర‌కు రాలేదు. ఆ షోలో వేసే కామెడీ స్కిట్లు విప‌రీతంగా జ‌నాల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ స్కిట్లే కాదు.. ఆ షో జ‌డ్జిలు అయిన నాగబాబు, రోజా త‌మ‌దైన న‌వ్వుల‌తో ఆ షోకు క‌ళ తెచ్చారు. రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి చూస్తే ఆ షోలో వారిద్ద‌రి ప్లేసులో వేరే వారిని ఊహించుకోవ‌డం క‌ష్టం. ఆ స్థాయిలో సెట్ అయిపోయారు వాళ్లు.
తాజాగా ఆ ఇద్ద‌రు ఇపుడు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఒకరు జ‌న‌సేన త‌ర‌ఫున ఎంపీగా, ఇంకొక‌రు వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా. ఇక పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వారికి స‌మ‌యం చాలక తాత్కాలికంగా ఈ షోకు బై చెప్పారు. పోలింగ్ త‌ర్వాత వారు మ‌ళ్లీ ఈ షోకు వ‌స్తారు. అయితే...ప్ర‌స్తుతం పోటీ చేస్తున్న ప‌దువులు గెలిచినా షో చేయ‌డానికి ఏ ఇబ్బంది ఉండ‌దు గాని ఒకవేళ అదృష్టం వ‌రించి అంత‌కంటే పెద్ద ప‌ద‌వులు వ‌స్తే వారు ఈ షోకు దూరం కావ‌చ్చు. కాక‌పోతే ఇద్ద‌రిలో ఇద్ద‌రికీ అలాంటి అవ‌కాశం రాదు. ఎందుకంటే వారు ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో ఉన్నారు.
మ‌రి వారిద్ద‌రు లేక‌పోతే జడ్జిమెంట్ ఎవ‌రు చెబుతారు అని ఆందోళ‌న ప‌డ‌కండి. జబర్ద‌స్త్ ప్రోగ్రాంకు కొత్త జడ్జీలు వ‌చ్చారు. రోజాతో పాటు క‌ల‌సి ప‌లు సినిమాల్లో న‌టించి మీనా రోజాస్థానాన్ని ఆక్ర‌మించ‌గా, అనేక షోల‌లో చేస్తున్న శేఖ‌ర్ మాస్టార్ నాగ‌బాబు స్థానాన్ని తీసుకున్నారు. తాజాగా వీరిద్దరిపై తీసిన ఒక ప్రొమో బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ విష‌యం వెలుగుచూసింది. జ‌డ్జిలు మారార‌న్న ఈ వార్త నెట్లో బాగా వైర‌ల్ అవుతోంది.