చైనాను నిషేధించిన నాగబాబు !!... నిజమండీ

August 08, 2020

నాగబాబు ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. లాక్ డౌన్లో ఏమీ తోచక టీవీని, సోషల్ మీడియాను నాగబాబు వదలడం లేదు. స్పందించడానికి ఏ అంశం దొరుకుతుందా అన్నట్లు స్పందిస్తున్నాడు. మొన్నామధ్య యువకుల్లో పౌరుషం లేదు... భగత్ సింగ్ వంటి వారి గాథలు వారికి వినిపించాలి, చూపించాలి. అపుడు యువత తిరగబడటం నేర్చుకుంటుంది అన్నారు.

ఆ తర్వాత తనకు సంబంధం లేని నాగబాబు ఇష్యూలో వేలు పెట్టి మరో సారి తాను తిట్టించుకుని, అన్నయ్యపై మళ్లీ బాలయ్యతో ఆరోపణలు చేయించాడు. అంతకుముందు గాడ్సే ఈజ్ గ్రేట్... గాంధీ కూడా అన్నట్లు ఒక పనికిమాలిన చర్చపెట్టి అందరితో తిట్లు తిన్నారు నాగబాబు. ఈరోజు తాజాగా ఆయనకు చైనా మీద కోపం వచ్చింది. వెంటనే ట్విట్టరు చేతిలో అందుకుని తన దేశభక్తిని చాటుకున్నారు.

ఇది నాగబాబు వేసిన ట్వీట్ :

@banchinaproducts and @banchinaapps మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని,సెల్ ఫోన్ apps ని బహిష్కరిద్దాం.మన దేశం లో తయారైన వస్తువుల ని కొందాం.ప్రపంచం లో మన దేశం పెద్ద మార్కెట్.అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు..contd 

అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటె మన దేశమే లాభపడుతుంది.తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది.మనందరం బాగుపడతాం.మన డబ్బు  మన దేశంలో నే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని ban చేద్దామ్.@beindianbuyindian  

ముందు ఇందులో మిస్టేక్ ఏంటంటే... # ఈ హ్యాష్ ట్యాగ్ వాడాల్సిన చోట @ ఈ ట్యాగ్ వాడి సామాజిక మాధ్యమాలపై తన అజ్జానాన్ని చాటుకున్నాడు. ఇక నాగబాబు ఎపుడు దొరుకుతాడా అని చూసే కొందరికి బెల్లంముక్క అందించినట్లయ్యింది.

ఒక్కో రిప్లై ఎలా ఉన్నాయంటే... నాగబాబు ఎందుకు పెట్టానురా ఈ ట్వీట్ అన్నట్టున్నాయి. 

 

కొన్ని రిప్లైస్ ఇవిగో :

Srinivas

ఒక్కసారి నువ్వు వాడుతున్న ఫోన్, కారు, వాచ్, ఏసీ, మిగతా గృహోపకరణాలు ఎంటో చెప్పు ఒక్కసారి నిజాయితీ గ. తరువాత కబుర్లు చెబుదువు గానీ. మాటలు చెప్పినంత ఈజీ కాదు. నిజం గా అలా జరగాలి అంటే పాలసీ లు మార్చాలి, సంస్కరణలు తీసుకురావాలి.. మీ లాంటి విలువలు లేని (**తిట్టు తొలగించబడింది**) రాజకీయాలకి దూరం గా ఉండాలి.  

Anjali 

Vivo oppo xiomi oneplus .... ఈ బ్రాండ్ మొబైల్స్ మీ జనసైనికులు ఎవరైనా వాడుతుంటే బైట పడేయమని చెప్పు నాగీ

mr. balu

అది ఏంటో తెలియదు గానీ నీ అజ్ఞానాంధకారం నీ ప్రతి ట్వీట్లో నాకు కనిపిస్తోంది

 
 
 

Chinese products exports to india is just 3% If we ban Chinese products,who could replace the products quality & quantity? Are we ready to face this సంక్షోభం? China spent 40 yrs to build this Empire  

 

 

-: CLEANED :-