నోటి దూల... కేసు దాకా తీసుకెళ్లింది !!

May 30, 2020

మనకు ఎన్నయినా అభిప్రాయాలుండొచ్చు. కానీ అన్నిటినీ బయటకు చెప్పలేం. కొన్ని మనసులో దాచుకోక తప్పదు. మహాత్మాగాంధీ... ఈ కంట్రీ టవరింగ్ పర్సనాలిటీ. ఆయన హత్యకు దారితీసిన ఎలాంటి కారణమైనా ఆయన హత్య అనే ఘోరం కంటే చిన్నదే అవుతుంది. మహాత్మను ప్రపంచం చూస్తున్న తీరు అలా ఉంది. దేశం మహాత్మను గుర్తించిన తీరు అలా ఉంది. జనం ఆయనను అభిమానిస్తున్న తీరు అలా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా... నాథూరామ్ గాడ్సే తరఫున వకాల్తా పుచ్చుకున్న నాగబాబు ఇరుక్కుపోయారు. 

నాగబాబు వివాదం ఆ కుటుంబాన్ని ఇరుకున పెట్టడమే కాదు, రాజకీయంగా జనసేనను ఇరుకున పెట్టింది. వీటికితోడు కాంగ్రెస్ నేత కోటూరి మానవతారాయ్ తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషనులో నాగబాబుపై కేసు పెట్టారు. ఆయనకు మతి భ్రమించిందని, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించమని కోరారు. అతని మానసిక స్థితి బాలేనందు వల్లే గాడ్సేను కీర్తించారన్నారు. 

 

నాగబాబును ఇరుకున పెట్టిన ట్వీటు ఇదే...

ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే  ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.

-------

ఇది చదివారా?

పాపం.... నాగబాబు, ఫ్యామిలీ మొత్తాన్ని ఇరకాటంలో పెట్టాడు

Read Also

దూల తీర్చిన దూల్ పేట... తప్పు పోలీసులదేనా?
మొదటి సారి కేసీఆర్ మైండ్ బ్లాక్ చేసిన కిషన్ రెడ్డి
కేసీఆర్ నిన్న చెప్పిన ఆ రెండూ అబద్ధాలేనా?