పాపం.... నాగబాబు, ఫ్యామిలీ మొత్తాన్ని ఇరకాటంలో పెట్టాడు

August 05, 2020

ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి మూడు పాత్రు పోషిస్తాడు. విచిత్రం ఏంటంటే... ఆ మూడుపాత్రలకు ఎంతటి వేరియేషన్ ఉంటుందో... సరిగ్గా మెగా బ్రదర్స్ రిలయ్ లైఫ్ లో అంతే వేరియేషన్ ఉంటుంది. ఆ సినిమాలో చిన్నవాడైన శాస్త్రి లా సాత్వికంగా ఉంటారు రియల్ లైఫ్ చిరంజీవి. వివాదాలంటే భయం. నెమ్మదస్తుడు. 

ఇక ఆ సినిమాలో ఇన్ స్పెక్టర్లాగా ఉంటారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఒక‌ప్పుడు బాగా ఆవేశంతో క‌నిపించేవాడు కానీ.. గ‌త కొన్నేళ్ల‌లో అత‌నెంతో మారాడు. దూకుడు బాగా తగ్గిపోయింది. సంచలన వ్యాఖ్యలు చేసినా తర్వాత సర్దుకుంటాడు. రాజ‌కీయాల్లోను అన‌వ‌స‌ర వివాదాల జోలికి వెళ్ల‌ట్లేదు. 

ఇక నాగ‌బాబు రూటు మాత్రం వేరు. ముగ్గురు మొనగాళ్లలో పెద్ద వాడి క్యారెక్టర్ లాగా ఉత్తినే వివాదాల్లో ఉంటాడు. నా ఇష్టం పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమారలు వార్తలకెక్కాడు.  ఇటీవల ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా నాగ‌బాబు చురకలు వేస్తున్నాడు. అయితే... తాజాగా నాగబాబు నాథూరాం గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. నాథూరం గాడ్సేని దేశభక్తుడిగా వ్యాఖ్యానించారు. దీంతో ఇది పెద్ద దుమారం రేపింది. ఇక్కడ నాగ‌బాబు ఉద్దేశంతో ఎవరికీ సంబంధం లేదు. మెజారిటీ మనుషులను నొప్పించాయి నాగబాబు మాటలు. అవి ఎంత డామేజ్ చేశాయంటే...

స్వ‌యంగా జ‌న‌సైనికులే నాగ‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ఇది జ‌న‌సేన‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. 

కొందరు వీరాభిమానులు అయితే నాగ‌బాబును డిఫెండ్ చేయ‌లేక మౌనంగా ఉండిపోయారు. ప‌రిస్థితి అర్థమై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ నాగ‌బాబుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. వారు మందలించడంతో  వెంట‌నే వివ‌ర‌ణ ఇస్తూ ట్వీట్ వేశాడంటున్నారు. 

వాస్తవానికి మన దేశంలో నాథూరాం గాడ్సేను సమర్థించేవారంతా గాంధీ వ్యతిరేకులు కాదు... ఒక వర్గం ఇక్కడ బలపడటానికి గాంధీయే కారణం అన్న బాధతోగాడ్సేను సమర్థించే వాళ్లే. అసలు గాడ్సే నేపథ్యం ఏంటో కూడా వారికి తెలియదు. నాగబాబు ఆయన గురించి చదివి ట్వీట్ చేశాడట. ఎన్ని వివరణలు ఇచ్చినా... మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి నాగబాబు బాగా డ్యామేజ్ చేశాడు. ’’నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’’ అంటూ వివ‌ర‌ణ ఇచ్చినా నాగ‌బాబును ఎవరూ క్షమించడం లేదు.

తాజాగా కాంగ్రెస్ నేత రాములమ్మ అలియాస్ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించారు. ‘ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్.. ''నాకు కూడా''...''అని'' గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు, మహాత్మా మన్నించండి’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. నాగబాబు ప్రస్తావన తీసుకురాకున్నా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తూ.. మెగా బ్రదర్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు రాములమ్మ.