​విజయసాయిరెడ్డికి మొగుడిలా తయారవుతున్న నాగబాబు

July 04, 2020

ట్వీట్లతో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ లై విరుచుకుపడే విజయసాయిరెడ్డికి నాగబాబు రూపంలో కొత్త మొగుడు వచ్చినట్టుంది. పవన్ ప్రభావం ఏమీ లేదు అంటూనే...నిరంతరం పవన్ కు భయపడుతుంటారు వైసీపీ నేతలు. ​పవన్ అంటే వైసీపీ మొత్తానికి ఒకరకమైన భయం. అందుకే చంద్రబాబు కంటే కూడా పవన్ పై ఎక్కువ విమర్శలు చేస్తుంటారు సాయిరెడ్డి.

తాజాగా బీజేపీ - జనసేన పొత్తుపై సెటైర్లు వేశారు సాయిరెడ్డి. బీజేపీ అనే మాట తన పొరపాటున కూడా ట్వీట్లో ఏనాడూ ప్రస్తావించే ధైర్యం ఎలాగూ సాయిరెడ్డికి లేదు. తమను భయపెట్టే పార్టీతో జనసేనకు పొత్తు కుదరడం వారికి ఇష్టం లేదు. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి.  పవన్ పొత్తు పై సాయిరెడ్డి చేసిన కామెంట్లుకు నాగబాబు ఘాటు రిప్లయి ఇచ్చారు. 

జీరో విలువ తెలియని వెధవలకి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. ఇవాళ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ మొత్తం సున్నా వల్లనే ఇంత వృద్ధి చెందాయి. ఇది తెలుసుకోండిరా జ్జానం లేని సన్నాసుల్లారా అంటూ సాయిరెడ్డి పేరు పెట్టకుండా తిట్టాల్సినదంతా తిట్టేశాడు సాయిరెడ్డి. 

అక్కడితో ఆగలేదు. మంది సొమ్ము మెక్కిన వెధవలు కూడా నీతులు మాట్లాడుతున్నారు. ఖర్మరా దేవుడా అంటూ నాగబాబు సాయిరెడ్డి చెవి మెలితిప్పారు. ఇపుడే  కాదు, కొన్ని రోజులుగా ట్విట్టరులో నాగబాబు యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా సాయిరెడ్డికి, వైసీపీకి వ్యతిరేకంగా జనసైనికుల్లో ఉత్సాహం నింపడానికే నాగబాబు యాక్టివ్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈ వార్ ఎంత దాకా వెళ్తుందో మరి !