బాలయ్య సారీ చెప్పాల్సిందే - చిరు తమ్ముడు

August 04, 2020

మంత్రి తలసానితో సినిమా పెద్దల మీటింగ్ పై బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఉలికి పాటుకు గురిచేశాయి. కేసీఆర్, తలసాని రెండు మీటింగులకు బాలకృష్ణకు ఆహ్వానం లేదన్న విషయం ఈరోజే బయటకు వచ్చింది. మొదట కేసీఆర్ మీటింగ్ ప్రస్తావన వచ్చినపుడు బాలయ్య కాంట్రవర్సీని అవాయిడ్ చేశారు. ఇంకో సందర్భంలో తలసాని వ్యవహారం గురించి వచ్చినపుడు బాలయ్యకు కోపం వచ్చినట్టుంది. ఏం రహస్యాలున్నాయి. భూములు పంచుకోవడానికి వెళ్లారా అన్నట్లు ఆయన వ్యాఖ్యలు ప్రచారం అయ్యాయి. దీనిపై చిరంజీవి తమ్ముడు నాగబాబు స్పందించారు.

టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడం పొరపాటేనని నిర్మాతల మండలి సభ్యులు ఇప్పటికే అన్నారు. ఆ కుటుంబంలో అంత మంది నటులు, నిర్మాతలు ఉన్నా మరిచిపోవడం పొరపాటు కాదు, అదింకేదో అనే అనుకుంటారు ఎవరైనా. అలాగే బాలయ్య కూడా అనుకున్నారు. దీంతో బాలయ్య మనసులో మాట చెప్పారు. దీంతో నాగబాబుకు మండింది. ఓ వీడియో విడుదల చేశారు.

’’బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదు. భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరం.  బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బాలకృష్ణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారా? అంతకంటే పది రెట్లు ఎక్కువ మాట్లాడగలం.  ఇండస్ట్రీకి మీరే కింగ్‌ కాదు.. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్‌కు..తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఈ మాత్రం కామెంట్లకు నీకు పొడుసుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ను వైసీపీ వాళ్లు పావలా? పిచ్చి కుక్క, మూడు పెళ్లిళ్లోడు అంటే ఎందుకు మీ నోరు లెగవదు ? భయమా నాగబాబు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజమే ఎన్నికల తర్వాత వైసీపీ వాళ్లు ఏమన్నా నాగబాబు స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకో మరి.