నాగబాబు పిచ్చికుక్క కామెంట్ బ్యాక్ ఫైర్

August 05, 2020

బాలకృష్ణ మీద చటుక్కున నోరు జారేసుకున్న నాగబాబు తీవ్ర ఒత్తిడిలోకి పోయాడు. బాలకృష్ణను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నారు. నిన్న అర్ధరాత్రి నాగబాబు ఒక ట్వీట్ వేశారు. అది ఇలా ఉంది.

‘‘ప్రజారోగ్యం హెచ్చరిక: పిచ్చికుక్కలతో డీల్ చేయడం కష్టం. అయితే వాటిని బోనులో పెట్టాలి లేదంటే చంపేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అలా వదిలేయకూడదు. ఎందుకంటే అది జీవితాలను నాశనం చేస్తుంది. ఇది పిచ్చికుక్కల సీజన్‘‘ 

ఈ ట్వీట్ చూసిన వెంటనే ఎవరిని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడో అందరికీ అర్థమైపోయింది. దీంతో బాలకృష్ణ అభిమానులు,టీడీపీ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. కొందరు వైసీపీ అభిమానులు కూడా తగులుకున్నారు.

ఒక వైసీపీ అభిమాని స్పందిస్తూ.... నిజమే నువ్వు చెప్పినట్లు ఎన్నికలపుడు వాటిని ‘1’ కి పరిమితం చేశాం. దానిని కూడా ఇపుడు మా దారిలోకి తెచ్చకున్నాం అంటూ సంచలన రిప్లై ఇచ్చారు.

తమరు ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణను హిందూపురంలో గెలవనీయను అని శపథం చేసినట్టు గుర్తు. ఇదిగో రిజల్టు అంటూ ఈ ఫొటో పెట్టారు. Image 

ఇంకా మొరుగుతున్నావా అంటూ మరో నెటిజన్  ఈ కింద ఫొటో పెట్టాడు. ఇది వెయ్యి మాటలతో సమానం అనిపించేలా ఉంది.

Image 

అంజలి అనే ఒక నెటిజన్ శ్రీరెడ్డి పవన్ ని తిడితే బయటకు రావు, కేసీఆర్ పవన్ ని బండబూతులు తిడితే బయటకు రావు... బాలకృష్ణ తిడితే బయటకు వస్తున్నావు.. పబ్లిసిటీ గట్టిగా వస్తుందని అని కామెంట్ చేసింది. 

తారక్ ఫ్యాన్ అనే మరో నెటిజన్ సింపుల్ గా ఈ ఫొటో రిప్లై ఇచ్చారు.

 Image 

వీటన్నింటికంటే పవన్ ను ఉద్దేశించి కేసీఆర్ తిట్టిన బూతుల వీడియో ఒక నెటిజన్ షేర్ చేసి.... ఎంత భయముంటే వీల్లను పొగుడుతావు అంటూ అనుమానం వ్యక్తంచేశారు. ఇదిగో వీడియో !