చిరంజీవి రాజకీయ జీవితానికి నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫుల్‌స్టాప్!

June 04, 2020

చిరంజీవి రాజకీయ జీవితానికి నిన్న పవన్ కళ్యాణ్, నేడు నాగబాబు ఫుల్‌స్టాప్ పెట్టారా? మెగాస్టార్ ఇక పూర్తిస్థాయిగా సినిమాలకే అంకితం అవుతారని, రాజకీయాలకు దూరంగా ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. అలాగే, పవన్ కళ్యాణ్ ప్రజలకు తనకంటే మెరుగ్గా సేవ చేయగలరని భావించి, తమ్ముడి కోసం రాజకీయాన్ని త్యాగం చేశారని చెప్పారు. పవన్ రాజకీయం, నాగబాబు వ్యాఖ్యలతో చిరంజీవి రాజకీయాలను పూర్తిగా వదిలి వేసినట్లుగానే భావించవలసి ఉంటుంది.

ఏ రకంగా చూసినా చిరంజీవి రాజకీయాలకు దూరం జరిగారనే చెప్పవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా లేరు. అన్నయ్య గురించి నాగబాబు తేల్చేశారు! జనసేనాని పవన్ కళ్యాణ్ తాను ఇప్పటికిప్పుడు అధికారం కోరుకోవడం లేదని, 25 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటానని పదేపదే చెబుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే ఇక చిరంజీవి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లేనని చెప్పవచ్చు. తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అలాగని యాక్టివ్ రోల్ లేదు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని.. కాదు కాదు.. తమ్ముడికి అండగా నిలబడతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ మౌనమే ఆయన సమాధానం అయింది. ఎన్నికల సమయంలోను ఎవరికీ ప్రచారం చేయలేదు. అలాంటి చిరంజీవి మనసులో ఏముందో చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కానీ రాజకీయాల పట్ల ఆయన విసుగు చెందారనే విషయం అర్థమైందనేది ఎక్కువమంది మాట. కాబట్టి పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన పవన్ కోసం.. నాగబాబు చెప్పినట్లుగా.. చిరంజీవి తన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టి పెట్టినట్లుగానే భావించాలని అంటున్నారు.

కానీ చిరంజీవి మనసులో ఏముందో మాత్రం తెలియరాలేదు. సహజంగా ఆయన సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి. ఏమంటే ఏమవుతుందోనని అధికారికంగా ప్రకటించకుండానే దూరంగా లేరు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నేతగా ఆయన క్రియాశీలకంగా లేరు. గత ఎన్నికల్లోను ప్రచారం చేయలేదు. కాబట్టి రాజకీయ సన్యాసం వంటి ప్రకటనలు లేకుండానే.. నాగబాబు చెప్పినట్లుగా తమ్ముడి కోసం దూరం జరిగినట్లుగా భావించవచ్చు. అన్నయ్య మదిలో ఏముందో అందరికీ తెలియనప్పటికీ, ఆయన మనసును నాగబాబు గ్రహించకుండానే ఇలా చెబుతారని కూడా అనుకోలేమని అంటున్నారు.