అంబటి ఒక ఆట ఆడుకున్న నాగబాబు !

June 06, 2020

ఏపీ నాయకులు చంద్రబాబును పవన్ నిందించడం మీద పెట్టిన శ్రద్ధ ఏపీ ప్రజల్లో చైతన్యం తెచ్చి కరోనాను అరికట్టడంపై చూపడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కావస్తున్నా జగన్ తప్పలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు ఏపీ నాయకులు. ఇదిలా ఉండగా... ఏకంగా ఏపీ నాయకులకే కరోనా వైరస్ రావడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. 

అయితే తాజాగా మాటిమాటికి నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబుపై నాగబాబు వ్యంగాస్త్రాలు వేశారు. 

**ఈ టైంలో ఈ ఎదవ రాజకీయలేందుకు @ambatirambabu  గారు. చడవవడం కాదు చదవటం అని రాయాలి..ఈ మధ్య ,మీరేదో దావత్ కి వెళ్లారని పైత్యం చేసిందని పబ్లిక్ లో రూమర్స్ వచ్చాయి..మీ హెల్త్ జాగ్రత్త.car(ona)u కూతలు  కూయకండి.మీకు పైత్యం చేసిందనుకొంటారు. జనం ప్రాణాల మీదకు వస్తుంటే ఎలక్షన్ క్యాన్సల్..​చేసిన ఎలక్షన్ కమిషనర్ ని మీలాగా అడ్డగోలుగా బుద్ది లేకుండా తిట్టకుండా  @pawankalyan తనకి చేతనైన సాయం చేస్తున్నాడు. అలాంటి వాడిని విమర్శిస్తే ఎలా వుంటాదో తెలుసా ఆకాశం లో ఉసినట్లు ఉంటది. sorry మాస్క్ ఉంటది కదా తీసి ఉయండి. అప్పుడే కరెక్ట్ గా మీ మొహం మీద పడుతోంది. హెల్త్ జాగ్రత్త సర్..​** అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. 

ఇంతకీ నాగబాబు కి ఇంతకోపం ఎందుకొచ్చింది అంటే... పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారికోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవిస్తుంటే...వారు వేగంగా స్పందించి పరిష్కరిస్తున్నారు. విచిత్రంగా కొన్ని సార్లు జగన్ పార్టీ సభ్యులకు ఆ రెస్పాన్స్ రాలేదు. దీంతో వారికి ఇది ఇబ్బంది కరంగా మారింది. పైగా పవన్ కూడా ముందు ఏపీ సీఎంకి రిక్వెస్ట్ పెట్టారు. ఆయన పెద్దగా పట్టించుకోకపోయేటప్పటికి తనే స్వయంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడగడం మొదలుపెట్టారు. వారి నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది వైసీపీ నేతలకు అవమానంగా మారింది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పనిని సులువుగా పవన్ చేయడం వారికి నచ్చలేదు. దీంతో పవన్ చేసిన మంచి పనిని కూడా ఎగతాళి చేస్తూ అంబటి ట్వీట్ పెట్టారు. దీంతో నాగబాబు సీరియస్ గా స్పందించారు.