వైసీపీలోకి నాగబాబు ???

August 14, 2020

ఎవరు అవునన్నా... ఎవరు కాదన్నా... జరగబోయేది ఇదే... నాగబాబు వైసీపీలోకి చేరతాను అని అధికారికంగా ప్రకటించకపోయినా, నాగబాబు ప్రైవేటుగా కూడా ఆ విషయం చర్చించకపోయినా... గత వారం రోజులుగా ఆయన వేస్తున్న ట్వీట్లు ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. నాగబాబు వైసీపీలోకి చేరడం అనేది కచ్చితంగా జరగబోయే పరిణామం. దానికి ఉత్తమ తార్కాణం నాగబాబు ఈరోజు రాత్రి వేసిన ట్వీటే. 

బాలయ్య వివాదంతో తెలుగుదేశం పార్టీపై పోరు మొదలుపెట్టిన నాగబాబు తర్వాత బాలకృష్ణను వదిలేసినా టీడీపీ వదల్లేదు. ఇంతకాలం జనసేన గెలుస్తుంది. జనసేనదే రాజ్యం అంటూ పదేపదే చెప్పుకువచ్చిన నాగబాబు... మొదటిసారి గతవారంలో ’’జనసేన గెలుస్తుందో లేదో తెలియదు గాని టీడీపీ మాత్రం గెలవదు‘‘ అన్నాడు. ఒకసారి కాదు, ఒక టైంలో కాదు. ఒక్క వారంలో అనేక సార్లు, వేర్వేరు రోజుల్లో ఇదే విషయాన్ని ఆయన పదేపదే చెప్పారు.

వైసీపీ అధినేత జనసేన అధినేత పవన్ ను ఎంత దారుణంగా వ్యాఖ్యానించిందీ అందరికీ తెలుసు. కానీ వైసీపీ పట్ల నాగబాబులో సాఫ్ట్ కార్నర్ పెరిగిపోతోంది. తొలుత జనసేన అధికారంలోకి వస్తుందో, వైకాపా వస్తుందో తెలియదు కాని... టీడీపీ రాదని మొదలుపెట్టిన ఈ మొనగాడు... తర్వాత వేగంగా మరింత మారిపోయాడు. వైకాపాయే రావాలి అన్న ఆకాంక్షను చాలా చక్కగా వెలిబుచ్చాడు. ఇందుకు గాను ఆయన చేసిన కామెంట్ ఏంటో తెలుసా.. టీడీపీకి వైసీపీయే కరెక్ట్ అట.

అసలు నాగబాబు జనసేన మనిషి అయితే ఇలా మాట్లాడుతాడా? జనసేన నుంచి మానసికంగా బయటకు వచ్చిన నాగబాబు టెక్నికల్ గా బయటకు రావడమే తరువాయి. ఆ పార్టీ వ్యక్తి బహిరంగంగా మా పార్టీ వస్తుందో రాదో అన్నాడంటే ఇక అతనిలో పార్టీ భావజాలం చచ్చిపోయినట్లే. మరోవైపు వైకాపా మళ్లీ రావాలన్న బలమైన ఆకాంక్షను వెలిబుచ్చినట్లే అని అనుకోవాలి.

తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టుపై జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అవినీతి చేసిన వారిని అరెస్టు చేయడంలో తప్పు లేదు. కానీ కక్ష సాధింపుకోసం కాదని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నిబంధనలు పాటించాలి. అచ్చెన్నాయుడి అరెస్టులో అవి లోపించాయి... 

ఈ ప్రకటన విడుదల అయిన దీనికి విరుద్ధమైన ట్వీట్స్ వేశాడు నాగబాబు. 

టీడీపీ హయాం లో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియా లో ఏదో అన్నారు అని మా జనసేన కార్య కర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి , వాళ్ళని గొడ్ల ని బాది నట్లు బాది,అంత హింస పెట్టిన టీడీపీ, ఇప్పడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీస్ అరెస్ట్ చేస్తే టీడీపీ, టీడీపీ అనుకూల

మీడియా అంత గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు ఆఫ్ట్రాల్ కార్యకర్తలు, నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశ్యం.. karma has No menu. you get what you deserve..మా జనసేన కార్యకర్తల ని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీ కి అంత తేలిగ్గా పోతుందా.!

నాగబాబు ట్వీట్లకు జనసైనికులు తీవ్రంగా తప్పుపట్టారు. నువ్వు పవన్ ని నీచంగా అవమానించిన వైసీపీకి మద్దతు పలుకుతావా?

అసలు ఈ జనవరిలో వైసీపీ వాళ్లు కాకినాడ రోడ్ల మీద జనసేన మహిళలను తరిమి వెంటాడిన విషయం మరిచిపోయావా? అంటూ ఒక నెటిజన్ తీవ్రంగా తిట్టాడు నాగబాబును.

పవన్ ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి ద్వారంపూడికి వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తులేదా? థూ నీ బతుకు అంటూ జనసైనికులు మండిపడ్డారు.

వైసీపీ నిత్యం జనసేనను నాశనం చేస్తుంటే... టీడీపీలో ఆధారంగా కూడా లేని గాసిప్స్ ను ప్రస్తావించి వేటాడి కొట్టిన ఈ ఏడాది కాకినాడ ఘటన మరిచిపోతావా అంటూ ఒక నెటిజన్ పోస్టు పెట్టాడు.

మొత్తానికి నాగబాబు త్వరలో వైసీపీ కండువా కప్పుకోవడం గ్యారంటీ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

ఏపీ సర్కారు తొలి విడదల ఇచ్చే స్టూడియో స్థలాల్లో తొలి లబ్ధిదారులు చిరంజీవి, నాగబాబేనా అంటూ విమర్శలు చేశారు ఇంకొందరు.