హీరో నాగార్జున విశ్వరూపం

August 08, 2020

గడిచిన రెండు సీజన్లకు భిన్నంగా సాగుతోంది తెలుగు బిగ్ బాస్ 3. గత రెండు సీజన్లలో కనిపించని కొత్త కోణాలు.. భావోద్వేగాలు.. ఆవేశాలు.. గోలలు.. రచ్చలు.. ఇలా ఎన్నో వికారాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది తాజా సీజన్. ఆయన హౌస్ లో ఉంటూ.. ఇంటికి పెద్ద.. తిరుగులేని అధికారాలు ఉన్న బిగ్ బాస్ మీదనే ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన పునర్నవి భూపాలానికి భారీ క్లాస్ ఇచ్చారు నాగ్.
వారాంతంలో కనిపిస్తూ.. అటు ప్రేక్షకుల్ని.. ఇటు కంటెస్టెంట్లకు ఆట విడుపు అన్నట్లుగా వ్యవహరించే నాగ్.. ఈసారి తన జోష్ లో సీరియస్ నెస్ నింపారు. అందమైన భామలతో స్టెప్పులేసి హుషారుగా వచ్చినట్లుగా కనిపించినా.. రావటం రావటంతోనే.. కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యారు.
ఈ మధ్య ఎపిసోడ్ లో బిగ్ బాస్ ను ఉద్దేశిస్తూ.. పునర్నవి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. ఏయ్ బిగ్ బాస్.. తొక్కలో గేమ్స్ నువ్వునూ.. మాకు గతి లేక బిగ్ బాస్ హౌస్ కి వచ్చామా? కాస్త బుద్ది.. జ్ఞానం ఉండాలి. ఈ ఆటలు నువ్వే ఆడుకో. నువ్వే పెద్ద కరెక్ట్ అనుకుంటున్నావ్. నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చే గేమ్ లు నేను ఆడను పో అంటూ రచ్చ చేసిన పునర్నవిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు నాగ్.
ఈ వారం ఆట-పాటతో అలరించిన నాగ్.. ఆ వెంటనే షూకు సీరియస్ గా పాలిష్ చేసుకోవటం ద్వారా పునర్నివికి కౌంటర్ ఇవ్వటానికి సిద్ధమైనట్లుగా అర్థమైంది. షూ పాలిష్ చేయటాన్ని తప్పు పడుతూ.. తక్కువ చేసి మాట్లాడిన పునర్నవి తీరును తప్పు పట్టడమేకాదు.. స్వయంగా తాను పాలిష్ చేసుకుంటున్నానంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పటానికేనన్నారు.
చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గటం పెరగటం ఉండదని.. చేసే తీరుతోనే ఉంటుందంటూ క్లాస్ పీకారు. పునర్నవిని క్లాస్ పీకటం కోసం ఆమె అన్న మాటల్ని మ్యూట్ చేయాలని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసి మరీ మొదలెట్టారు నాగ్. ఆమెను గురువింద గింజతో పోలుస్తూ.. నువ్వు గురువింద గింజలా ఉన్నావు. పైనున్న ఎరుపు కనిపిస్తోంది. కింద ఉన్న నలుపు కనిపిస్తోంది. ఇప్పుడైనా గేమ్ ఆడు అంటూ వార్నింగ్ ఇచ్చిన నాగ్.. ఒక దశలో నువ్వు హౌస్ లో ఉండి మాట్లాడే మాటలేమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నువ్వు హౌస్ లో అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యావో అర్థం కావట్లేదని పునర్నవిని ప్రశ్నించిన నాగ్.. నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదని తేల్చేశారు. హౌస్ లో ఆడితేనే గెలుస్తారని.. ప్రేక్షకులు ఆదరిస్తేనే హౌస్ లో ఉంటారని.. అందుకే హౌస్ లో ఉండాలంటే గేమ్ ఆడాలన్నారు. హౌస్ లో తన మాటలతో రచ్చ చేసిన పునర్నవి తొక్కు తీసినట్లుగా గట్టి క్లాస్ పీకారు నాగ్.