​ఆ వీసీకి బుద్ధొచ్చిందా ? 

February 25, 2020

కొందరు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. వారు నేరం చేయలేదు​. నిబంధనలు తప్పలేదు. అమ్మాయిల మీద అఘాయిత్యం చేయలేదు. కానీ కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వీసీ స్వయంగా దీనికి బాధ్యులు. ఇది తాజాగా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఘటన. ఎందుకబ్బా ఏ కారణంతో వారిని సస్పెండ్ చేరానుకుంటున్నారా... అమరావతికి మద్దతు పలికినందుకు. అమరావతికి మద్దతు పలకడం ఏ చట్టం ప్రకారం నేరం. ఉన్నత విద్యావంతుడైన వీసీ ఒక్క నిమిషం ఆలోచించకుండా  అలా ఎలా నిర్ణయం తీసుకున్నారో తెలియక అందరూ విస్మయానికి గురయ్యారు. అమరావతి పరిరక్షణ కోసం ఏర్పడి అఖిల పక్ష సమావేశం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.  

తాజాగా ప్రజలందరూ గట్టిగా విమర్శించేటప్పటికి చేసిన తప్పు యూనివర్సిటీ పెద్దలకు అర్థమైంది.   ‘జై అమరావతి’ అన్న విద్యార్థులపై నాగార్జున యూనివర్సిటీలో  విధించిన సస్పెన్షన్‌ను తొలగించారు. ఇదిలా ఉండగా... ఇలా ఒక పార్టీకి తలొగ్గి వ్యవహరించినందుకు యూనివర్సిటీ ఉపకులపతి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు ఈరోజు అమరావతి పరిరక్షణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో  ధర్నాకు దిగారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే అమరావతి వేడి ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. ఇంకా ఎన్ని వేషాలు వేస్తుందో గవర్నమెంటు?