బీజేపీకి శివసేన షాకు...

August 14, 2020

లాక్ డౌన్ సమయంలో ఉద్దవ్ పదవి ఊడబీకే అవకాశం వచ్చినా బీజేపీ దానిని ఉపయోగించుకోలేదు. శివసేనపై ఏదో మూలన ప్రేమ. రెండు హిందు మత పార్టీలే కదా. తాజాగా శివసేన మాత్రం బీజేపీకి భారీ షాకిచ్చింది. ఇంతకాలం మర్కజ్ సమావేశానికి వెళ్లిన తబ్లిగీల వల్ల ఈరోజు దేశంలో ఇన్ని కేసులు వ్యాప్తిచెందాయి అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ శివసేన కొత్త రాగం ఎత్తుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తికి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమమే అసలు కారణం అని  శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, ముంబయి, ఢిల్లీలో కరోనా వైరస్ ఇంత పెద్ద సంఖ్యలో వ్యాప్తిచెందడానికి ఫిబ్రవరి చివర్లో నిర్వహించిన నమస్తే ట్రంప్ ప్రధాన కారణం అని... దానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని ఆయన పేర్కొనడం గమనార్హం. అదెలా అంటే... ఈ మూడు నగరాల్లో అమెరికాకు చెందిన ప్రతినిధులు పర్యటించారని, వారిలో చాలా మంది కరోనా రోగులు ఉన్నారని... అందువల్లే వారి నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని ఆయన ఆరోపించారు. 

ఈ విషయాన్ని శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన ప్రత్యేక కథనంలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అంటే ఈ ఆర్టికల్ ద్వారా కాంగ్రెస్ కు బూస్ట్ ఇవ్వడానికి శివసేన సాయం చేసినట్టయ్యింది. ముందస్తు ప్రణాళిక లేకుండా కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించి వలస కూలీలకు కరోనా అంటించదని ఆయన మరో ఆరోపణ చేశారు. అంతా శృతిమించాక ఆంక్షల సడలింపు బాధ్యతలను రాష్ట్రాల నెత్తిన పడేసిందని విమర్శించారు.

రాజకీయమే శ్వాసగా బతికే బీజేపీ మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చేదామా? అని గోతికాడ నక్కలా కాచుకుందని... ఆ అవకాశం బీజేపీకి ఎన్నటికీ ఇవ్వం అన్నారాయన.