హాట్ భామ పోర్న్ వార్నింగ్... ఆమె ఏం చేసిందంటే... 

August 05, 2020

టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తక్కువ కాలంలో హాట్ భామగా అందరి మనసుల్లో రిజిస్టర్ అయ్యారు నమిత. బొద్దుగుమ్మగా.. తర్వాత కాలంలో స్లిమ్ గా మారిన ఆమె తాజాగా తనను ఆన్ లైన్లో బెదిరిస్తున్న ఒక వ్యక్తికి దిమ్మ తిరిగేలా చేశారు. టాలీవుడ్ తో పోలిస్తే.. కోలీవుడ్ లో నమితకున్న ఫాలో యింగ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఆన్ లైన్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు.
తనకు చెందిన పోర్న్ వీడియోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని తాను అప్ లోడ్ చేస్తానంటూ ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. అతగాడి మాటల్లో నిజం ఎంతన్నది తనకు తెలుసు కాబట్టి.. తాను గట్టిగా.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ తేల్చి చెప్పినట్లు వెల్లడించారు.
అంతేకాదు.. తనను బ్లాక్ మొయిల్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి వివరాల్ని బయటపెట్టంతో పాటు.. అతడి సోషల్ అకౌంట్ బ్లాక్ అయ్యేలా చేశారు. సెంటమిజ్ అనే నెటిజన్ తనను బెదిరించటంతో పాటు.. చులకన చేసేలా మెసేజ్ లు పోస్టు చేసినట్లుగా పేర్కొంది. అతగాడి అకౌంట్ ను బయటపెట్టింది కూడా. తనను హాయ్ ఐటెమ్ అంటూ నీచంగా పిలిచేవాడని మండిపడింది.
గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన తన గురించి అంతా తెలుసని అనుకోవటం తప్పన్న ఆమె.. ఒక వ్యక్తిగా తన గురించి ఏం తెలుసు? అంటూ సదరు వ్యక్తిని ప్రశ్నించింది. తొలుత తాను మౌనంగా ఉన్నానని.. దాన్ని బలహీనతగా భావించకూడదన్న ఆమె.. తనను బెదిరింపులకు గురి చేసిన వ్యక్తికి దిమ్మ తిరిగేలా షాకిచ్చింది.