రవి ప్రకాష్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కస్టడీకి ఒప్పుకో ని నాంపల్లి కోర్ట్ 

July 11, 2020

అలంద మీడియా కేసులో… 18కోట్లు దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపి, అరెస్ట్‌ చేసిన పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. 18కోట్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్, కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇప్పటికే ఇదే కేసులో… హైకోర్ట్‌ ముందస్తు బెయిల్ మంజూరు చేయటం, ఆ కేసులో అరెస్ట్‌ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. కొత్తగా ఎఫ్.ఐ.ఆర్‌లు కూడా నమోదు చేయకుండా… ఇతరత్రా ఆరోపణలు ఉంటే ఇప్పటికే నమోదైన ఎఫ్.ఐ.ఆర్‌లకే జత చేయాల్సి ఉన్న పోలీసులు దురుద్దేశపూర్వకంగా అరెస్ట్‌కు కుట్రపన్నారని రవిప్రకాశ్‌ తరుపు న్యాయవాదులు ఆరోపించారు. అయితే, ఇదే కేసులో ఇప్పటికే రవిప్రకాశ్ తరుపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేయగా… దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.