గ్యాంగ్ లీడ‌ర్ ఎక్క‌డున్నాడు..

February 19, 2020

నేచుర‌ల్ స్టార్ నాని కొత్త సినిమా గ్యాంగ్ లీడ‌ర్‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రీక్షా స‌మ‌యం మొద‌లైంది. వీకెండ్ త‌ర్వాత ఈ చిత్ర వ‌సూళ్లు బాగానే డ్రాప్ అయ్యాయి. సోమ‌వారం ఉద‌యం షోల‌కు ఆక్యుపెన్సీ 30 శాతానికి ప‌డిపోయింది. సాయంత్రానికి కాస్త పుంజుకుని 50 శాతానికి అటు ఇటుగా ఆక్యుపెన్సీతో న‌డించి సినిమా. మ‌రి మంగ‌ళ‌వారం ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తొలి మూడు రోజుల్లో స‌గ‌టున రోజుకు రూ.5 కోట్ల‌కు త‌క్కువ కాకుండా షేర్ రాబ‌ట్టిన గ్యాంగ్ లీడ‌ర్.. నాలుగో రోజు రూ.2 కోట్ల షేర్ రాబడితే గొప్ప అన్న‌ట్లుంది ప‌రిస్థితి. డివైడ్ టాక్, యావ‌రేజ్ రివ్యూల‌ను త‌ట్టుకుని ఈ చిత్రం వీకెండ్లో మంచి వ‌సూళ్లే సాధించింది. టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వ‌చ్చే పెద్ద స్టార్ల సినిమాల్లాగే ఈ చిత్రం కూడా తొలి మూడు రోజుల్లో అంచ‌నాల్ని మించి క‌లెక్ష‌న్లు తెచ్చుకుంది.
తొలి మూడు రోజుల్లో గ్యాంగ్ లీడ‌ర్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ రూ.16 కోట్ల దాకా ఉండ‌టం విశేషం. తెలంగాణ‌లో రూ.4.66 కోట్లు, ఏపీలో రూ.7 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టింది గ్యాంగ్ లీడ‌ర్. క‌ర్ణాట‌క‌లో రూ.కోటి దాకా షేర్ వ‌చ్చింది. అమెరికాలో అంచ‌నాల్ని మించి పెర్ఫామ్ చేసిన గ్యాంగ్ లీడ‌ర్ ఇప్ప‌టికే 7 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. షేర్ రూ.2.5 కోట్ల దాకా వ‌చ్చింది. మొత్తం షేర్ రూ.16 కోట్లకు ద‌గ్గ‌ర‌గా ఉంది. ఐతే గ్యాంగ్ లీడ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంకా చాలా దూర‌మే ప్ర‌యాణించాల్సి ఉంది. ఇంకో రూ.12-13 కోట్ల మ‌ధ్య షేర్ సాధిస్తేనే బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి వ‌స్తారు. మ‌రి సోమ‌వారం షేర్ ఎంత ఉంటుంది, ఈ వారాంతంలో రాబోతున్న వాల్మీకికి ఎలాంటి టాక్ వ‌స్తుంది అన్న దాన్ని బ‌ట్టి గ్యాంగ్ లీడ‌ర్‌కు బ్రేక్ ఈవెన్ సాధ్య‌మా కాదా అన్న‌ది తేలుతుంది.

Read Also

అనసూయ కొత్త ఫొటో షూట్...
సారీ చెప్పిన అనసూయ
రాజ‌మౌళిని ఇలా వాడేయ‌డం త‌ప్పు క‌దా?