బెదిరించిన ఏపీ సర్కారు... బెదరని కేశినేని

June 02, 2020

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు నిరాధారంగా అబద్ధాతో అవలీలగా విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక చుక్కలు కనిపిస్తున్నాయి. అపుడు అబద్ధాలు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలుచేసిన వైసీపీ నేతలు ఇపుడు నిజాలు చెబితే కూడా భరించలేని పరిస్థితికి చేరుకున్నారు. కరోనాను ఆపడలంలో అడగడుగునా ఫెయిలవడమే కాకుండా వ్యాప్తికి కారణం అవుతున్నారు. సాయిరెడ్డి, అవంతి, రోజా, రజని తదితరులు చిన్నచిన్న సాయాలు చేయడానికి పెద్ద టెంట్లు వేసి గుంపులుగా నిలబడి లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు. సామాజిక దూరం శూన్యం.

ఇదిలా ఉండగా... టెస్టు కిట్లను కేంద్రం సహకారంతో కొరియా నుంచి తెప్పించుకున్నారు. వాటికి ధర నిర్ణయించే విషయంలో భారీ స్కాముకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు ఈ ఆరోపణలు రావడానికి కారణమే వైసీపీ సర్కారు. ఎందుకంటే... ఎక్కడా పారదర్శకత పాటించలేదు. అన్ని ప్రభుత్వాలు తాము ఎంత పెట్టి కొన్నామో బహిరంగంగా చెప్పాయి. కానీ వైసీపీ సర్కారు దాచింది. దాస్తున్నారంటే ఏదో జరుగుతోంది అని ఆరోపణలు వినిపించాయి. అవి తప్పు అని నిజాలను ఆధారాలతో చెప్పాల్సిన ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో తాము 700 లకు ఒక కిట్ కొన్నట్లు చెప్పింది. ఈ లెక్కన చూసినా చత్తీస్ ఘడ్ కంటే 300 రూపాయలు ఎక్కువ పెట్టినట్లు. 

ఈ వ్యవహారంపై స్కామును బయటపెట్టాలని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. ఎందుకు మీరు శ్వేత పత్రం విడుదల చేయడం లేదు. మీరు తప్పుచేయకుంటే బయటపెట్టడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి అని కన్నా నిలదీశారు. కన్నా ట్వీట్ తర్వాతే ఆరోగ్య ఆంధ్ర ట్విట్టరు అక్కౌంట్ ద్వారా ప్రభుత్వం ఈ స్కామ్ గురించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పింది. ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయని కేశినేని నాని... ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏంటి అంటూ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. 

మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకో వెళ్తుందో చూడాలి. ఫైనల్ రేటు తగ్గించమని కంపెనీని కోరుతున్నట్టు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.