ఎన్నికల ఫలితాలపై తొలిసారి మాట్లాడిన భువనేశ్వరి

October 18, 2019

అదేంటి ఫలితాలు వచ్చిన నెల రోజులు అయితే... ఇపుడు దాని గురించి మాట్లాడటం ఏంటనుకుంటున్నారా? ఆమె తొలిసారిగా ఇపుడే మీడియా ముందుకు వచ్చి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కేవలం ఇల్లాలు మాత్రమే కాదు, వ్యాపారి, సామాజిక సేవకురాలు కూడా. ఆమె తన వ్యాపారాలు నిర్వహిస్తూనే తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించే స్కూళ్లను నిర్వహిస్తుంటారు. సేవాభావంతో నడిచే ఈ పాఠశాలల్లో ఎందరో పేద విద్యార్థులు చదివి ఉన్నత స్థానాలు అధిరోహించి జీవితంలో సెటిలయ్యారు.
తాజాగా గురువారం గండిపేటలోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ కి భువనేశ్వరి వచ్చారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడూత సడెన్ గా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. జీవితంలో గెలుపు, ఓటమి రెండూ భాగమే అని, ఓడినపుడు మళ్లీ మరోపోరాటానికి సిద్ధం కావడంలోనే మన ఆత్మస్థైర్యం దాగుందన్నారు. ఓటమి దరిచేరినా ధైర్యంగా నిలబడండి, పోరాడటం అలవర్చుకోండి.. అంటూ అటు విద్యార్థులకు పార్టీ కార్యకర్తలకు ఇరువురికీ ఒకేసారి పిలుపునిచ్చారు.
అయితే, ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ కామెంట్ ఆసక్తికరంగా ఉంది. కార్యక్షేత్రంలోకి దిగితేనే అసలేం జరిగిందనే వాస్తవాలు తెలుస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. అంటే... ఇంతవరకు చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియలేదు, అందుకే ఆయన సతీమణికి కూడా ఇంకా క్లారిటీ రాలేదు, కారణాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అర్థమవుతోంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం స్వయంగా చంద్రబాబే చెప్పారు. అయితే, సూక్ష్మ స్థాయిలో తెలియకపోయినా స్థూలంగా అయినా ఓటమి కారణాలను అధినేత పసిగట్టారా? లేదా?