అమరావతిలో రైతులను ఆశ్చర్యపరిచిన నారా భువనేశ్వరి

April 03, 2020

కొత్త సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. అమరావతి రైతులు రోడ్డున పడిన వేళ, వారు దు:ఖంలో ఉన్నపుడు వేడుకలు వద్దని చంద్రబాబు వేడుకలు నిషేధించారు. అదేసమయంలో ఈరోజంతా కుటుంబంతో కలిసి వారి మధ్యనే ఉండాలని డిసైడయ్యారు. అందుకే భార్య భువనేశ్వరితో కలిసి అమరావతికి వెళ్లారు. ఈ సందర్భంగా వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్న భువనేశ్వరి... చంద్రబాబు మీకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా కలత చెందుతున్నారని, అన్నం తినేటపుడు, పడుకునేటపుడు కూడా మీ గురించే మాట్లాడుతున్నారని భువనేశ్వరి చెప్పారు. ప్రజల తర్వాతే బాబుకు కుటుంబం గుర్తువస్తుందన్నారు. 

చంద్రబాబుతో కలిసి ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. వారి ఆవేదనను విన్నారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడికక్కడే అమరావతి ఉద్యమానికి తన చేతికి ఉన్న రెండు బంగారు గాజులు తీసి విరాళంగా ఇచ్చేశారు. రాజధాని కోసం మీరు ఉన్నదంతా ఇచ్చేశారు. మీ త్యాగం ఊరికే పోదు. మీకోసం చంద్రన్న కృషిచేస్తారు. మీ పోరాటమంతా మీకు అండగా ఉంటారు.. అని చెప్పారు భువనేశ్వరి. ఓ మహిళ భువనేశ్వరితో మాట్లాడుతూ... వీళ్ల బుద్ధి తెలియక చంద్రన్నను తప్పుగా అర్థం చేసుకుని మోసపోయాం అమ్మా అని బోరుమంది.