​లోకేష్ టైమింగ్ కి... పార్టీ నేతలు ఫిదా

August 05, 2020

లోకేష్ లో మార్పును చూస్తూనే ఉన్నాం. మునుపటితో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగ్గా, సూటిగా స్పందించిన దొరికిన ప్రతి అవకాశాన్ని లోకేష్ సద్వినియోగం చేసుకుని సత్తా చూపుతున్నాడని చెప్పడానికి తాజా ఉదాహరణ హిందూపురంలో మీడియాపై జరిగిన దాడిని లోకేష్ ఖండించిన విధానం. 

అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. 

దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టులపై దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నారా లోకేష్ అన్నారు. 

‘‘రాజారెడ్డి రాజ్యాంగంలో మీడియాకు కూడా ప్రశ్నించే హక్కు లేదని చెప్పడమే ఈ దాడి ఉద్దేశం. జీవో 2430 జీవో తీసుకొచ్చి మీడియా గొంతునొక్కింది వైకాపా ప్రభుత్వం. గతంలో నెల్లూరు,ప్రకాశం జిల్లాలో పాత్రికేయుల పై వైకాపా రౌడీ నాయకులు హత్యాయత్నం చేసారు.అమరావతి ఉద్యమం సందర్భంగా పాత్రికేయుల పై అక్రమ కేసులు పెట్టారు.వైకాపా నాయకులు అధికార మదంతో వ్యవస్థల్ని నాశనం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారు‘‘ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.

మీడియా పై కేసులు పెట్టడానికి అనుమతి ఇచ్చే జీవోను వైకాపా ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఒక జీవో తెచ్చింది. దానిని ఈ సంఘటనలో ప్రస్తావించడం ద్వారా లోకేష్ ప్రభుత్వాన్ని సరిగ్గా ఇరుకున పెట్టినట్టయ్యింది.

సందర్భానుసారం గతాన్ని వర్తమానంలోకి లోకేష్ తెచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు అనుచరులను, పార్టీ శ్రేణులను మెప్పించింది.