రేపు సీమ గడ్డపై లోకేష్ ప్రెస్ మీట్

August 13, 2020

తెలుగుదేశం ప్రమఖ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ రేపు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని స్వయంగా కలవనున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాదు నుంచి రోడ్డ మార్గం ద్వారా బయలు దేరి 11 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో లోకేష్ జేసీ కుటుంబాన్ని కలవనున్నారు. వారిని కలసిన అనంతరం దివాకర్ రెడ్డితో పాటు ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.

సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని తన నివాసానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తాజాగా వెల్లడించింది. 

జేసీ తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నో వేధింపులను చూశారు. తెలుగుదేశం పార్టీకి ఇపుడు జేసీ చాలా దగ్గరయ్యారు. నిజానికి జగనే ఆ పని చేశారు. ఇంతవరకు పార్టీలో మాత్రమే ఉన్న జేసీ కుటుంబాన్ని ఈ అరెస్టులతో నారా కుటుంబం మనిసిగా చేశాడు జగన్. 

తాజా అరెస్టులతో ప్రతీకారం కోసం అయినా... జగన్ కి దూరంగా ఈ కుటుంబం శాశ్వతంగా తెలుగుదేశంలోనే కొనసాగే అవకాశం ఉంది. తన తెలివితక్కువ తనంతో జగన్ తెలుగుదేశం పార్టీని మరింత బలంగా మారుస్తున్నారు. కార్యకర్తల్లో మరింత కాంక్షను రగిల్చేలా పనిచేస్తున్నారు.