యంగ్ టీడీపీ - లోకేష్ తో టీడీపీ యువనేతల కుటుంబాల విందు

June 03, 2020

మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఈ సారి ప్రజామోదాన్ని మరింత పెంచుకుని విజయతీరాలకు చేరడానికి వ్యూహరచన చేస్తోంది. రాజకీయాల్లో వస్తున్న మార్పులు, యువ భాగస్వామ్యం అంశం తెలుగుదేశం యువ లీడర్లు మొత్తం హైదరాబాదులోని నారా లోకేష్ ఇంట్లో సమావేశం అయ్యారు. శ్రీకాళం యువ నేత రామ్మోహన్ నాయుడు మొదలుకుని... అనంతపురం యువ తనే జేసీ కుమారుడు పవన్ వరకు దాదాపు అందరు నేతలు కుటుంబాలతో సహా పాల్గొన్నారు. 

ప్రభుత్వం తప్పులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం, రాజకీయంగా పోరాట వ్యూహాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలతో సహా కీలక మైన విషయాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యం ఉండటం... టీడీపీలో ఎన్టీఆర్ తరమే తెరమీద ఎక్కువ కనిపిస్తు ఉన్న నేపథ్యంలో కొత్త తరం తెరపైకి రావడానికి అవసరమైన వ్యూహాల గురించి కూడా సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కు పథకాల రచన బాగున్నా.. దానికి అవసరమైన సంపద సృస్టిలో అతను ఘోరంగా ఫెయిలవుతున్న నేపథ్యంలో చాలా సులువుగా వేగంగా టీడీపీ ఎదుగుతుందని, టీడీపీ పాలన దక్షత ఏంటో ప్రజలకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చాలా త్వరగా మనవైపు చూస్తారని నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ లో సోషల్ మీడియా పాత్రపై ప్రధాన చర్చ జరిగింది.