'సింహా' డైలాగుతో రెచ్చిపోయిన లోకేష్ !

August 08, 2020

ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ నారా పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక పాయింట్ తో ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్న లోకేష్ తాజాగా ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు నందమూరి బాలకృష్ణ 'సింహా' డైలాగును పోలి ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ చర్చించుకుంటున్నారు. లోకేష్ ఫైర్ మీదున్నాడు అని అంటున్నారు.

తాజాగా పలువురు తెలుగుదేశం సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో లోకేష్ ట్విట్టరు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘‘వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి,మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి. 

మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు జగన్ గారు గారు.​ ​భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?

ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ, కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?‘‘ అంటూ లోకేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

గతంతో పోలిస్తే లోకేష్ లో వైకాపా కూడా ఊహించని దూకుడు కనిపిస్తోంది. పార్టీ తరఫున మాట్లాడేవారికి అండగా ఉంటారు లోకేష్ అన్న భావన కార్యకర్తలు, సానుభూతి పరుల్లో కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇది మరిన్ని రూపాల్లో ప్రదర్శిస్తూ అవసరమైతే పార్టీ కార్యకర్తలకు న్యాయ సహాయం వరకు అండగా నిలబడితే పార్టీ తిరిగి కోలుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందకంటే సీట్ల పరంగా బాగా తగ్గినా... ఓట్ల పరంగా ప్రజలనుంచి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో భారీ మద్దతే లభించింది.