5 కోట్లు డబ్బు రాష్ట్రం ఎలా దాటింది?

August 10, 2020

ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కరు ఉన్న కారులో ఒంగోలు వ్యక్తులు డబ్బు తరలించడంపై ఏపీలో దుమారం రేగుతోంది. ఒంగోలు నుంచి నెల్లూరు హద్దులు దాటే వరకు ఆ డబ్బును ఏ చెక్ పోస్టులోను పట్టుకోకపోవడం తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇపుడు ఏపీలో జనం చర్చించుకుంటున్న ఈ టాపిక్ పై ఏపీ మంత్రి బాలినేని ఉలిక్కిపడ్డారు. 

ఇదిలా ఉండగా దీనిపై నారాలోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది

జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.   ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?

నారా లోకేష్ ట్వీట్ వేయకముందే ఏపీలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఎక్కడో తమిళనాడుకు వెళ్లేవరకు అన్ని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు దాటి డబ్బు ఎలా వెళ్లిందన్ని ఇపుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మంత్రి బాలినేని ఆ డబ్బు తనది కాదని ఖండించారు. డబ్బు ఎవరిదైనా గాని చెక్ పోస్టుల్లో ఎందుకు తనిఖీ చేయడం లేదన్నది ఇపుడు అందరు అడుగుతున్న ప్రశ్న. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది.

డబ్బుకు సంబంధించిన వివరాలను చెప్పకపోవడంతో పోలీసులు కారును, డబ్బును సీజ్ చేశారు. కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చిన విషయం తెలిసిందే. కారులో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.