తాడిపత్రిలో లోకేష్ - సీమ నుంచే వార్నింగ్

August 06, 2020

వైఎస్ జగన్ అనుసరిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలనకు తావులేదని, కేవలం ప్రతీకారేచ్ఛ మాత్రమే ఉంటుందని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేసి  ఫిబ్రవరి నుంచి కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్. 

ఈరోజు లోేకష్ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ కుటుంబాన్ని కలవడానికి వారికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన లోకేష్ స్వచ్చందంగా తరలివచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. వారికి చేతులు ఊపుతూ లోకేష్ జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అండ మీ కుటుంబానికి ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డికి లోకేష్ భరోసా ఇచ్చారు. 

 

 

అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలు తేవాలని జగన్ ఉబలాటపడుతున్నారు. జగన్ లాగా ప్రభాకర్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు కాదు. జేసీపై అస్మిత్ పై పెట్టినవన్నీ తప్పుడు కేసులు. అన్నీ రాసుకుంటున్నాం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని ముఖ్యమంత్రి జగన్ ని నారా లోకేష్ హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా... ప్రస్తుతం జేసీ ప్రభాకర్, అస్మిత్ ఇద్దరు కడప జైల్లో ఉన్నారు.