బీజేపీకి వచ్చే సీట్లు ఎన్నంటే - చంద్రబాబు సర్వే

April 01, 2020

గుజరాత్ లో మోడీ పుట్టడం గాంధీ దురదృష్టం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక సత్యవంతుడు పుట్టి పునీతం అయిన గుజరాత్ మోడీ వంటి అబద్ధాల కోరు పుట్టడం వల్ల పాపం చేసుకుందన్నారు. మోడీ ప్రతి విషయంలో అబద్ధం చెప్పారని, అన్నింటా ప్రజలను మోసం చేశారని అన్నారు. మోడీ దేశానికే ప్రమాదం అని అన్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు గ్రహించారని చంద్రబాబు చెప్పారు. 

కొన్ని తనకు తెలిసిన ప్రముఖ సర్వేల్లో బీజేపీకి రాబోయే ఎన్నికల్లో 170 సీట్లు మించి రావని తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి వెంకన్నస్వామినే మోసం చేస్తే ఆ దేవుడు ఊరికే ఉంటాడా శిక్షించకుండా అని చంద్రబాబు అన్నారు. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశాన్ని బాధపెట్టిందన్నారు. 2000 నోటు ప్రవేశపెట్టాలనుకున్నపుడు అసలు  నోట్ల రద్దులో అర్థమే లేదని, పెద్ద నోట్లు రద్దు ద్వారా నల్లధనం తగ్గుతుందని, కానీ 2 వేల నోటు పెట్టి ఆ నిర్ణయాన్ని మోడీ వృథా చేశారని చంద్రబాబు అన్నారు. 

ఆర్థిక నేరగాళ్లను విదేశాలకు పంపేశారు. తిరిగి తెస్తామని నాటకాలు ఆడుతున్నారు. కానీ తనకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలపై మాత్రం వేధింపులకు పాల్పడుతున్నారని మోడీని విమర్శించారు.

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నాడు, ఇవ్వలేదు.
  • గంగాను శుభ్రం చేస్తాను అన్నాడు చెయ్యలేదు
  • అందరికీ 15 లక్షలు ఇస్తాం. నల్లడబ్బును స్వాధీనం చేసుకుని పంచుతాం అన్నారు. అదీ లేదు.
  • దేశాన్ని రక్షిస్తాను అని దొంగలను రక్షిస్తున్నారు.
  • వంద రోజుల్లో దేశాన్ని మార్చకపోతే ఉరి తీయండి అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు.