తెలుగోళ్లఫై మోడీ సంచలన కామెంట్స్

July 06, 2020

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల 

కాదేదీ కవితకు అనర్హం...

అన్నారు శ్రీశ్రీ

రాముడు, సైన్యం, అమ్మ, పెళ్లాం, తెలుగోళ్లు....

కారెవరూ ప్రచారానికి అనర్హం ....

అంటున్నారు మోడీ.

ఒక దేశ ప్రధాని స్థాయికి తగని మాటలు మాట్లాడుతూ విభజించు పాలించు అనే వందేళ్ల నాటి బ్రిటిష్ విధానంతోపలు రాష్ట్రాలను హస్త గతం చేసుకున్న మోడీ ఏదో ఒక మాయ చేసి ఈసారి మళ్లీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మోడీ వస్తే ఇక ఇంది హిందూరాజ్యం అవుతుంది, రాముడు ఆలయం కడతాడు అని భావించిన భక్త్ ల కలలు నెరవేరలేదు. మోడీ వచ్చాక దేశంలో అవినీతిని కడిగేస్తాడు అని కలలు గన్న మధ్య తరగతి కలలు నెరవేరలేదు. మోడీ పీఎం అయితే... రామరాజ్యం వచ్చి మా బతుకులు బాగు అవుతాయి అనుకన్న పేదల కలలూ నెరవేరలేదు. నెరవేరిందల్లా దేశంలోని కార్పొరేట్ కంపెనీల కలలు మాత్రమే. 

శ్రీలంకలో బాంబు దాడులు జరిగి పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోతే మేము కాపాడలేక పోయాం మమ్మల్ని క్షమించండి అని  ఆ దేశ ప్రధాని చేతులు జోడించి క్షమాపణ అడిగారు. అదే మన దేశపు ఆపద్ధర్మ ప్రధాని మాత్రం 40 మందికి పైగా సైనికులు చనిపోతే వారి పేరు చెప్పి బీజేపీకి ఓట్లు వేయమని అడుగుతున్నాడు. ఒక రైలు ప్రమాదం జరిగిందని కేంద్ర మంత్రి పదవికే రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు అలంకరించిన సీట్లో ప్రధాని మోడీ కూర్చోవడం బాధాకరం. అతను తెలుగు వారిని ఇతర రాష్ట్రాల్లో అవమాన పరుస్తూ చూడండి కాంగ్రెస్ విభజించిన తెలుగు వారు ఎలా కొట్టుకుంటున్నారో, మేము విభజించిన మూడు రాష్ట్రాలు సంతోషంగా ఉన్నాయని ప్రచారం చేశారు. తెలుగు వారికి ఇంతకంటే అవమానం ఏముంటుంది? 

ఇలాంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి మన ప్రతిపక్ష నాయకుడు మద్దతు ఇవ్వడం, తెలుగు రాష్ట్రాలకు సదుపాయాలు కల్పించకుండా, గొడవలు తెంచకుండా పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రధానికి కేసీఆర్ లోపాయకారిగా సహకరించడం తెలుగు వారి ఆత్మలను క్షోభింపజేస్తోంది. అయినా తెలుగు వాళ్లు కొట్టుకుంటున్నది విభజన లోపాలు గురించి. మరి ప్రధాని గా ఐదేళ్లు ఉండి... ఆ లోపాలు ప్రధాని మోడీ ఎందుకు సవరించలేదు. ఎందుకంటే అతనికి తెలుగు వారు కొట్టుకుంటూ ఉంటే... తనకు లాభం కాబట్టి సమస్యల్ని పరిష్కరించడు. తెలుగు వాళ్లు కొట్టుకుంటూ ఉంటే ఎవరో ఒకరు తమ కూటమిలో ఉంటారనే కుట్ర మినహా మరేమీ కాదు.