ఆ ఒక్క నిర్ణయం మన దేశాన్ని శాశ్వతంగా కాపాడింది !!

August 11, 2020

సరిగ్గా 44 ఏండ్ల క్రితం 1975 జూన్ 25 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశం లో అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) విధించారు. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్ర లో ఈ ఎమర్జెన్సీ పీరియడ్ ఒక చీకటి రోజులు అని పేర్కొనవచ్చు. అంతర్గత భద్రతా అనే పేరుతో దేశం లో ఎమర్జెన్సీ విధించటం అదే మొదటి సారి. అదే చివరిసారి.

ఎమర్జెన్సీ గురించి భారత రాజ్యాంగం లో ఏముందో చూద్దాం

భారత రాజ్యాంగం ఆర్టికల్ 352 లో రెండు రకాల ఎమర్జెన్సీలు పేర్కొన్నారు.


1 యుద్ధం , విదేశీ దురాక్రమణ వాళ్ళ విధించే ఎమెర్జెన్సీ , దీనిని బహిర్గత కారణాలు వల్ల విధించే ఎమర్జెన్సీ అంటారు , 1962 లో చైనా యుద్ధం సందర్భంగా , 1971 లో పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఈ ఎమర్జెన్సీ విధించారు , అయితే 1962 లో విధించిన ఎమర్జెన్సీ 1968 వరకు వుంది , 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చిన 1962 లో విధించిన అత్యవసర పరిస్థితి అమలు లో ఉండటం తో మరో అత్యవసర పరిస్థితి విధించలేదు

2 అంతర్గత భద్రత కారణంగా ఎమర్జెన్సీ విధించటం , ఈ ఎమెర్జెన్సీ ని 1975 జూన్ 26 న విధించారు ఇది దేశం లో ప్రజా స్వామ్యానికి చీకటి రోజులు వంటివి .

ఎమర్జెన్సీ విధిస్తే ఏం జరుగుతుంది ?

1 ఎమర్జెన్సీ విదిస్తే , పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి , ముఖ్యంగా ఆర్టికల్ 19 లో పేర్కొన్న 6 రకాలు స్వేచ్ఛలు రద్దు అయిపోతాయి.

పౌరులకు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్రం ఉండదు

శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే అవకాశం ఉండదు

సంచార స్వేచ్ఛ ఉండదు

నివాస స్వేచ్ఛ ఉండదు

సంస్థలు సంఘాలు ఏర్పర్చుకుని స్వేచ్ఛ ఉండదు

ఇష్టమైన వృత్తి వ్యాపారాలు చేసే స్వేచ్ఛ ఉండదు

ఎప్పుడు అయితే ఈ స్వేచ్ఛలు రద్దు అవుతాయో పౌర జీవనం దుర్లభం అవుతుంది

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లో రాజకీయ ప్రత్యర్థులు అందరు ని ఈ స్వేచ్ఛలు రద్దు పేరు తో జైలు లో పెట్టించారు , పత్రిక స్వేచ్ఛ లేకండా చేసారు.

అయితే ఎమెర్జెన్సీ దురాగతాలు వల్ల ఇందిరా 1977 లో ఓడిపోయింది .

మురార్జీ దేశాయి ప్రధాని అయ్యారు. మురార్జీ దేశాయి ప్రధాని అవ్వగానే రాజ్యాంగం కి 44 సవరణ చేసారు. దీని ప్రకారం గతంలో ఉన్నట్టు కేంద్ర మంత్రి వర్గం మౌఖిక అనుమతి తో రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించడానికి వీల్లేదు. రాష్ట్ర పతి కేంద్ర క్యాబినెట్ లిఖిత పూర్వక అనుమతి తోనే రాష్ట్ర పతి ఎమెర్జెన్సీ ప్రకటించాలి అని మార్పు చేసారు.

ఎమర్జెన్సీ ప్రకటించాక అది ప్రకటించిన రెండు నెలలు లోపు పార్లమెంట్ ఆమోదం పొందాలి అని మౌలిక రాజ్యాంగం లో ఉంటే దానిని నెల లోపు ఆమోదం పొందాలి అని మురార్జీ సవరించారు

ఎమర్జెన్సీ పార్లమెంట్ ఆమోదం పొందాలి అంటే సభ కి హాజరు అయినా వారు లో 2 /3 వంతు మంది ఆమోదించాలి అని మౌలిక రాజ్యాంగం లో ఉంటే, ఎమర్జెన్సీ ఆమోదం పొందాలి అంటే సభ యొక్క మొత్తం సభ్యులలో 50 శాతం పైగా హాజరు అయ్యి , వారిలో 2 /3 వంతు మంది ఆమోదించాలి అని మొరార్జీ దేశాయ్ మార్పు చేసారు.

అంటే ఎమర్జెన్సీ ని ఆమోదించాలి అంటే ఖచ్చితంగా లోక్ సభ లో అయితే 273 మంది సభ్యుల హాజరు ఉండాలి. రాజ్యసభ లో అయితే 126 మంది హాజరు ఉండాలి, అప్పుడు మాత్రమే వోటింగ్ కి వెళ్ళాలి.

వాస్తవానికి పార్లమెంట్ లో బిల్ ఆమోదం పొందాలి అంటే సభకి హాజరు అయినా వారిలో 2 /3 వంతు ఆమోదించాలి అంటే 100 మంది ఎంపీలు సభ కి హాజరు అయ్యి అందులో 67 మంది ఆమోదించిన బిల్ ఆమోదం పొందినట్టే కాని మొరార్జీ దేశాయ్ తెచ్చిన మార్పులు ఖచ్చితం గా ఎమర్జెన్సీ ఆమోదించాలి అంటే ఉభయ సభలు లో 50 శాతం హాజరు ఉండాలి అని రాజ్యాంగ సవరణ లో పేర్కొన్నారు

అంతర్గత భద్రతా పేరు తో ఎమర్జెన్సీ విధించటాన్ని మొరార్జీ రద్దు చేసారు. అంతర్గత భద్రతా బదులు దేశం లో సాయుధ తిరుగుబాటు వస్తే దానిని అణచటానికి మాత్రమే ఎమెర్జెన్సీ ప్రకటించాలి అని రాజ్యాంగం సవరించారు.

సాయుధ తిరుగు బాటు పేరు తో ఎమర్జెన్సీ విధించిన పౌరుల యొక్క స్వేచ్ఛ హక్కులు రద్దు చెయ్యటానికి వీలు లేదు, అని మొరార్జీ దేశాయి రాజ్యాంగాన్ని సవరించారు.

1975 లో విధించిన ఎమెర్జెన్సీ కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం కూడా లేదు , ఇందిరా గాంధీ నోటి మాట తో అప్పటి రాష్ట్ర పతి పకీరుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చాక కేంద్ర మంత్రి వర్గం సమావేశం అయి ఎమర్జెన్సీ విధించామని రాష్ట్రపతి కి మౌఖిక సిపార్సు చేసారు. అందుకే ఏ ప్రధాని మళ్లీ ఇలాంటి పని చెయ్యకండా, కేంద్ర మంత్రి వర్గం లో క్యాబినెట్ మంత్రులు అనే హోదా ని 44 రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ ఏర్పాటు చేసారు. క్యాబినెట్ లిఖిత పూర్వక సిఫార్సులు ప్రకారమే రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించాలి అని మొరార్జీ మార్పు చేసారు, లిఖిత పూర్వక సిఫార్సులు మీద క్యాబినెట్ మంత్రులు అందరు సంతకం పెట్టాలి ,

ఎప్పుడు అయితే ఇటు వంటి మార్పులు చేశారో తరవాత ఏ ప్రధాని ఈ దేశంలో ఎమర్జెన్సీ విదించటానికి సాహసం చేయలేదు , కనీసం మురార్జీ చేసిన సిఫార్సులు మార్పు చేయాలన్న చర్చను పెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయలేదు.

పై కథనం అన్ని హక్కులు రచయితకే సొంతం.