NRI: నాట్స్ ... శభాష్ !!

June 06, 2020

సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తెలుగు నాట లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలు, అనాథలకు నాట్స్  ఉచితంగా పలుప్రాంతాల్లో  నిత్యావసరాలు, ఆహారం అందిస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని మంచికలలు అనే చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ ఉచితంగా  నిత్యావసరాలు పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి చొరవతో పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ఈ మంచి పని చేపట్టింది. ఇప్పటికే నాట్స్ తెలుగునాట నిరుపేదల ఆకలి బాధలు విషయం తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తగు సాయం చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.

విశాఖలో నాట్స్ నిత్యావసరాల పంపిణీ

తెలుగునాట లాక్‌డౌన్‌తో ఆకలిబాధలు పడే పేదలకు ఆకలితీర్చే ప్రయత్నాలు నాట్స్ ముమ్మరంగా చేస్తోంది. విశాఖ నగరంలో నాట్స్, గ్లో సంస్థతో కలిసి పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసింది. సేవే గమ్యం అనేది తన చేతల్లో చూపింది. విశాఖలోని షీలనగర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటో,లారీ డ్రైవర్లకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసింది.  

గ్లో సంస్థ నుంచి వెంకన్న చౌదరితో పాటు నాట్స్ ప్రతినిధిగా సూర్యదేవర రామానాయుడు ఈ నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేశారు. కష్టకాలంలో తమకు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చి ఎంతో మేలు చేశారని డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.