జగన్ కి నవయుగ ట్విస్ట్

February 24, 2020

ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు, ఏపీ భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు కావడంతో అందరి కళ్లు దీనిమీద ఉన్నాయి. తానేదో డబ్బులు మిగిలించాలని ముఖ్యమంత్రి జగన్ పనులు ఆపాడు. నవయుగకు కాంట్రాక్టను క్యాన్సిల్ చేశాడు. ఎటువంటి సహేతుక కారణం లేకుండా అర్ధాంతరంగా తప్పించారు. ఇన్నాళ్లు వేచిచూసిన నవయగ ఈరోజు కోర్టు మెట్లుఎక్కింది.
పోలవరం కాంట్రాక్టుని ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అర్థ రహితంగా, అర్ధాంతరంగా తమతో ఈ ఒప్పందం రద్దు చేయడం సరికాదని పిటీషన్‌లో కంపెనీ పేర్కొంది. పనులు వేగంగా చేస్తున్నాం అని, అయినా పక్కన పెట్టి రివర్స్ టెండరింగ్ కి ప్రభుత్వం వెళ్లడం ఏంటని.. పిటిషనులో తన ప్రశ్నలు వేసింది. పోలవరం పనులు తమకే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై కోర్టులో విచారణ మొదలైంది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు. వేగంగా కట్టరు అని చంద్రబాబు హయాంలో దాన్ని పనుల నిర్వహణ రాష్ట్రంలో చేతులోకి తీసుకున్నారు. డబ్బులు కేంద్రం ఇస్తుంది. కట్టేది రాష్ట్రం. దీంతో ఏపీ సర్కారు ముందుగా దానిని ఖర్చుపెట్టేసి కేంద్రం వెంటపడేది. దీంతో పనులు చాలావరకు అయిపోయాయి. ఇంకో 30 శాతం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి రావడం, కాంట్రాక్టు రద్దు చేయడం జరిగిపోయాయి. కేంద్రంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఓ జాతీయ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం జగన్ మిరాకిల్ మిస్టేక్.
ఎందుకంటే ఆలస్యం అయితే... ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ లాజిక్ మిస్సయిన ముఖ్యమంత్రి దానిని క్యాన్సిల్ చేశారు. దీంతో కోర్టులోతేల్చుకోవడానికి నవయుగ రెడీ అయిపోయింది.