ఇప్పుడా జంట న్యూయార్క్ లో మస్తు ఎంజాయ్ చేస్తోంది

June 02, 2020

ఈ రోజు నయన్ బర్త్ డే. ఆమె 35లోకి అడుగు పెడుతున్నారు. ప్రత్యేక సందర్భాల్ని విభిన్నంగా.. వినూత్నంగా జరుపుకోవటం నయనతారకు అలవాటు. తనవరకే కాదు.. తాను అభిమానించే వారు.. ప్రేమించే వారి ప్రత్యేకమైన రోజుల్ని ఆమె గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. అలాంటి ఆమె.. తన ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ తో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన విఘ్నేష్ పుట్టినరోజు వేడుకల్ని భారీగా నిర్వహించిన ఆమె.. ఇప్పుడు తన పుట్టినరోజు సంబరాల కోసం న్యూయార్క్ వెళ్లారు. అక్కడ సరదాగా తిరగుతూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారు చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోల్ని విఘ్నేశ్ షేర్ చేస్తున్నారు.
నయన్ బర్త్ డే సెలబ్రేషన్లో భాగంగా న్యూయార్క్ వెళ్లిన వారు.. అక్కడ బోనీకపూర్.. ఆయన చిన్నకుమార్తె ఖుషీ కపూర్ తో కలిసి డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను విఘ్నేశ్ షేర్ చేశారు. త్వరలోనే ఈ ప్రేమజంట ఒక్కటి కాబోతుందన్న మాట వినిపిస్తున్న వేళ.. వీరిద్దరి తాజా న్యూయార్క్ ట్రిప్ ఆసక్తికరంగా మారింది.