జీవితంలో నయనతార చేసిన అతి పెద్ద తప్పు

May 31, 2020

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. వారందరిలోకి ప్రత్యేకం నయనతార. ఆమె చేసే సినిమాలే కాదు.. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు.. కెరీర్ పరంగా ఆమె తీసుకునే నిర్ణయాలు తరచూ వార్తలుగా మారుతుంటాయి. నిర్మాత ఎంత ఆఫర్ చేసినా.. సదరు సినిమా ప్రమోషన్ లో పాల్గొనేందుకు ససేమిరా అని తేల్చటమే కాదు.. ఎంత పెద్ద బ్యానర్ అయినా.. ఎంత గొప్ప కథానాయకుడైనా సరే.. సినిమా అయ్యాక.. దాంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే ఏకైక నటీమణిగా నయన్ ను చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సినీ స్టార్లు ఎవరైనా సరే.. తమను తాము ప్రమోట్ చేసుకోవటానికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు.. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఈ విషయంలోనూ నయన్ స్టైల్ కాస్త భిన్నం. ఆమె ఎవరితోనూ మాట్లాడరు. ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇష్టపడరు. అలాంటి నయన్.. తాజాగా ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ తో మాట్లాడటం.. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ పై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కలలో కూడా ఊహించని రీతిలో భారీ వ్యాఖ్య ఆమె నోటి నుంచి వచ్చినట్లుగా వైరల్ అవుతోంది. జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు మురగదాస్ దర్శకత్వం వహించిన గజనీ సినిమాలో చేయటమన్నారు. అంత పెద్ద కామెంట్ చేసిన ఆమె.. తాజాగా రజనీ హీరోగా నటిస్తున్న దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్ కావటం గమనార్హం.
గజనీ మూవీలో నటించటం అంత పెద్ద తప్పు అయితే.. తాజాగా దర్బార్ చిత్రంలో ఎందుకు చేశారన్నది ఒక ప్రశ్న. అయితే.. గజని మూవీ సందర్భంగా ఎదురైన చేదు అనుభవానికి మించింది తాజా దర్బార్ షూట్ సమయంలోనూ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ నయన్ కు మురగదాస్ కు మధ్య తేడా ఎక్కడ వచ్చిందన్న విషయానికి వస్తే.. ఆ సినిమా షూట్ కు ముందు ఆమెకు చెప్పిన కథకు.. తర్వాత ఆమె చేత చేయించిన పాత్రకు సంబంధం లేదని చెబుతోంది.
దీనికి తగ్గట్లే గజని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ ముందు వరకూ ఏ సినిమాలోనూ చేసింది లేదు. తాజాగానటించిన దర్బార్ లోనూ నయన్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం పెండింగ్ లో పెట్టటంతో షూటింగ్ కు రాలేదని.. దీంతో రజనీ సైతం నయన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. చివరకు మురుగదాస్ రంగంలోకి దిగి ఆమెను ఒప్పించి.. షూట్ కు తెచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే.. తాను పారితోషికం కోసం ఇబ్బంది పెట్టేదానన్నట్లుగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ మురుగదాస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది నయన్. మరి.. ఆమె వ్యాఖ్యలపై మురుగదాస్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 

Read Also

రియల్ హాట్ పిక్: పిచ్చెక్కిస్తున్న మందిర బేడి
ఈఫిల్ టవర్ బాగుందా? ఈ పిల్ల బాగుందా?
అమలాపాల్... మోస్ట్ రొమాంటిక్ పిక్