నయన తార కు పెళ్లంట... చేతిలో బాబు ఎవరంట?

August 06, 2020

స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లాడబోతోంది. ఎవరినో కాదు, 2015 నుంచి తాను కలిసి తిరుగుతున్న విఘ్నేష్ శివన్ ను పెళ్లాడబోతోంది. ట్విస్ట్ ఏంటంటే... విఘ్నేష్ శివన్ కు పెళ్లయినట్లు ఎక్కడా సమాచారం లేదు. పైగా 2015 నుంచి కలిసి తిరుగుతున్న వీరికి 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు ఎవరో అంతుపట్టని విషయంగా ఉంది.

ఆ పిల్లాడిని ఎత్తుకుని నయనతార దిగిన ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్ శివన్... చేతిలో ఉన్న నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పిల్లాడి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. ఆ అమ్మను కన్న అమ్మకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు అని విఘ్నేశ్ శివన్ అన్నారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ప్రకటన. 

అయితే, ఇందులో తాను నయనను పెళ్లాడుతున్న విషయం క్లారిటీగా ఉంది గాని... ఆ పిల్ల తల్లి ఎవరు, ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? కొంపదీసి ఆ పిల్లాడు వీరు దత్తత తెచ్చుకున్న వ్యక్తి కాదుగా... !

ఇకపోతే గత డిసెంబరులో నయన తార, శివన్ పెళ్లి అని వార్తలు వచ్చినా అది జరగలేదు. తాజా అప్ డేట్ చూస్తుంటే... త్వరలో వీరి పెళ్లి ఖాయం అని తెలుస్తోంది. అంతకంటే ముందు ఆ పిల్లాడు ఎవరో క్లారిటీ ఇస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది.