కువైట్ లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

August 10, 2020

నందమూరి అందగాడు, నటసింహం బాలయ్య బాబు 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని కువైట్ తెలుగుదేశం అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో భారీగా ఉత్సవాల్ని నిర్వహించారు. కువైట్లో ప్రస్తుం ఉన్న లాక్ డౌన్ కారణంగా జీవన భృతిలేక తినటానికి ఇబ్బంది పడుతున్న తెలుగువారికి రేషన్ కిట్లను సాల్మియా, ఒమేరియా, అబు హలిఫా, సబాహియా, ఫహాహీల్, మంగాఫ్ మొదలగు ప్రంతాలలో వారివారి ఇంటి వద్దకు వెళ్ళి మరీ పంచారు.

అలాగే ప్రస్తుతం నడుస్తున్న లాక్ డౌన్ కారణంగా బాలయ్య బాబు జన్మదిన వేడుకలను వినూత్నంగా జూంకాల్ ద్వారా నిర్వహించారు. వివిద గల్ఫ్ దేశాల తెలుగుదేశం నాయకులు మరియు యు.కే.తెలుగుదేశం నాయకులతో పాటు కువైట్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేసారు.

ప్రత్యేకముగా రైల్వే కోడూరు తెలుగుదేశం నాయకులు, పోయిన ఎన్నికలలో ఎం.ఎల్.ఏ గా పోటిచేసిన శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు, గుంటూర్ నుంచి ఎన్.ఆర్.ఈ.టి.డి.పి.కన్వినర్ శ్రీ బుచ్చిరాం ప్రసాద్ గారు పాల్గొని అందరిని అప్యాయంగా పలకరించి బాలయ్య బాబుకి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ నేపథ్య గాయకుడు ప్రవీణ్ కుమార్ పాల్గొని బాలకృష్ణ మరియు పెద్ద ఎన్.టి.ఆర్ గారి హిట్ సాంగ్స్ తో అసాంతం అలరించి కార్యక్రమానికి ఆకర్షణ గా నిలిచారు. మూడుగంటల పాటు ఏకదాటిగా సాగిన ఈ కార్యక్రమం అసాంతం తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహాన్ని నింపినది.