వాళ్లు చెప్పినట్లే జరుగుతోంది

May 28, 2020

దేశంలో ఎగ్జిట్ పోల్స్ రాగానే అందరూ షాక్ కు గురయ్యారు. గతంలో కంటే మోడీకి ఎక్కువ వచ్చే అవకాశమే లేదని అందరూ ఫీలవుతుంటే.... మొత్తం మోడీ గాలే అంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ప్రస్తత ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మోడీ కూటమికే ప్రస్తుతం ఆధిక్యం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని త‌ప్ప‌ని.. వాటిని న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఎన్డీయేతర పక్షాలు చేసిన వాదన నిలవలేదు.
ఓట్ల లెక్కింపు మొద‌లై.. ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువడుతున్న వేళ.. విడుద‌ల‌వుతున్న అధిక్య‌త‌ల్ని చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ వంద శాతం నిజమని తేలింది. కొత్త పార్టీల అవసరం లేకుండా మోడీ మరోమారు ప్రధాని అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పాలిత రాస్ట్రాలతో పాటు కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా మోడీకి జైకొట్టడం ఆశ్చర్యం.
ట్రెండ్స్ చూస్తుంటే. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన దాని కంటే ఎక్కువ సీట్లు ఎన్డీయే కూట‌మికి దక్కినా నమ్మక తప్పని పరిస్థితి ఉంది.