సౌతిండియా సినీ ఇండస్ట్రీపైన నేహా షాకింగ్ వ్యాఖ్యలు

June 01, 2020
CTYPE html>
బాలీవుడ్ తో పోలిస్తే సౌతిండియా చిత్ర పరిశ్రమ గురించి విమర్శలు.. ఆరోపణలు తక్కువన్న మాట వినిపిస్తుంది. ఇకపై.. అలాంటి అవకాశం ఇవ్వని రీతిలో బాలీవుడ్ ప్రముఖ నటి నేహా ధూపియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దక్షిణాది సినీ పరిశ్రమ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారటమే కాదు.. మరీ ఇంత దారుణ పరిస్థితి ఉంటుందా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి.
సౌతిండియా సినీ ఇండస్ట్రీలో హీరోలకే తొలి ప్రాధాన్యమని.. హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఒక షోకు హాజరైన ఆమె అందరూ ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేవారు. చాలా రోజుల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. అప్పట్లో తాను దక్షిణాది సినిమాను చేస్తున్నానని.. ఒక రోజు షూటింగ్ సమయంలో తనకు చాలా ఆకలి వేసిందని.. అక్కడి వారిని ఫుడ్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
అయితే.. ఆమె రిక్వెస్ట్ కు భిన్నంగా అక్కడి సిబ్బంది రియాక్ట్ అయ్యారట. ముందు హీరోకు ఫుడ్ పెట్టిన తర్వాతే హీరోయిన్ కు పెడతారని చెప్పారట. నేహాకు ఆకలిగా ఉందన్న విషయాన్ని పట్టించుకోని వారు.. హీరో తిన్న తర్వాత మాత్రమే తనకు ఫుడ్ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దేవుడి దయ వలన తనకు మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు.
జరిగిన దాని మీద తనకు కోపం రాలేదని.. నవ్వుకున్నట్లు చెప్పారు. ఇంతకీ నేహా ధూపియా చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె తెలుగులో నటించిన సినిమాలు చూస్తే.. నిన్నే ఇష్టపడ్డానన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరగా బాలయ్య నటించిన పరమ వీర చక్ర సినిమాలో నటించారు. ఏ సినిమాకు తనకీ పరిస్థితి ఎదురైందన్నది చెప్పనప్పటికి.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరో.. హీరోయిన్ల మధ్య ఇంత వివక్ష ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా తన మాటలతో సౌత్ ఇండస్ట్రీకి నేహా భారీ షాకిచ్చారని చెప్పాలి.