ఆంధ్రాని కుదిపేస్తున్న ఆ వీడియో

August 05, 2020

కొందరు మనుషుల మధ్య బతికే మానవ మృగాలు.

రూపం మనుషులదే గాని లక్షణాలు మాత్రం రాక్షస లక్షణాలు

జంతువులతో పోలిస్తే వాటికి అవమానం. ఎందుకంటే జంతువులు తమకు హాని అనిపిస్తేనో, ఆకలి అనిపిస్తేనే అలా చేస్తాయి. కానీ కొందరు దుర్మార్గులు మన మధ్య బతుకుతూ విచక్షణ లేకుండా గడుపుతుంటారు. ఈరోజు నెల్లూరులో ఒక మహిళపై జరిగిన దాడిపై ఏపీలో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఏపీ మహిళా కమిషన్ మాత్రం ఈ వార్త రాసే సమయానికి స్పందించలేదు. 

నెల్లూరులోని ఏపీ టూరిజం ఆఫీసులో డిప్యూటీ మేనేజరుగా పనిచేసే ఒక రాక్షసుడు మాస్కు పెట్టుకోమని చెప్పిన తన కింద పనిచేసే మహిళను అత్యంత దారుణంగా హింసించాడు. టేబుల్ మీద ఉండే పిన్నింగ్ శూలంతో పొడిచాడు. అక్కడే ఉన్న కుర్చీ ఇనుప రాడ్ తో చితకబాదాడు. అందరూ ఆపుతున్నా విదిలించుకుని చితక్కొట్టాడు.

మూర్ఖంగా ప్రవర్తిస్తూ అతను చేసిన దాడికి ఆ మహిళ విలవిల్లాడిపోయింది. అత్యంత విషాదకరం ఏంటంటే... ఆమె ఒక వికలాంగురాలు కూడా. నిందితుడి పేరు భాస్కరరావు. ఏపీలోని ప్రతి ఒక్కరు ఈ దాడిని ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఆఫీసులు ఇలాంటి మృగాలను ఉంచితే ఇంకెంత మందికి ప్రమాదకరంగా మారుతారో, అతన్ని ఉద్యోగం పీకి జైల్లో పెట్టండి అని ఏపీ ప్రజలంతా గొంతెత్తి డిమాండ్ చేస్తున్నారు

పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటన జరిగింది 27వ తేదీ. అయితే నిందితుడు పరారీలో ఉన్నారు. చివరకు పోలీసు బృందాలు గాలించి పట్టుకున్నాయి. అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  

ఈ ఘటనపై లోకేష్ ట్వీట్ :

మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితుల‌కు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చ‌ట్టం ఎక్క‌డ
@ysjagan గారు? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పాల‌కులే ప్ర‌తీకారంతో చెలరేగిపోతుంటే కొంద‌రు అధికారులు అదే పంథాలో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
నెల్లూరు ఏపి టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మ‌హిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన‌ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవ‌టం కాదు. క‌ఠినంగా శిక్షించాలి.