రాహుల్ గాంధీకి ప్రశంసలు 

August 12, 2020
CTYPE html>
నెటిజన్లు రాహుల్ కి ప్రశంసలు తెలుపుతున్నారు. మన దేశంలో కరోనా గురించి చాలా ముందుగా అప్రమత్తం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీనే అని చెప్పాలి. ఫిబ్రవరి 12ను ఆయన వేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. కరోనాను ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటోంది. అది మన దేశాన్ని చాలా క్రిటికల్ స్టేజికి తీసుకెళ్తుంది. ప్రభుత్వం దానిని సీరియస్ గా తీసుకోవడం లేదని నాకనిపిస్తుంది. అది ఇండియాలో విస్తరిస్తే మన దేశ ప్రజలకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదం అని రాహుల్ గాంధీ ఆనాడే హెచ్చరించారు. కానీ అపుడు విదేశీ ప్రయాణికులపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. 
రాహుల్ చెప్పినపుడు మోడీ సర్కారు రియాక్ట్ అయిఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. అపుడే మేల్కొని ఇతర దేశాల్లోని ఎన్నారైలకు తిరిగి వచ్చేవారికి ఎవరైనా ఉంటే వారం గడువు ఇచ్చి పిలిపించి విదేశీ విమానాలు ఆపేయాల్సి ఉండింది. అలా జరిగి ఉంటే... ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే కరోనాకు గేట్లు మూసేసే అవకాశం ఉండేది. కాని దాని ప్రమాదాన్ని అంతగా గుర్తించలేదు మనవాళ్లు. అసలు WHO కూడా వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఉన్నా ఇంత ప్రమాదం ఉండేది కాదు. ఇటలీలో మారణ హోమం జరిగాక మిగతా వాళ్లు మేల్కొన్నారు. తర్వాత కూడా అనేక సార్లు మోడీకి రాహుల్ సలహా ఇచ్చారు. సింగపూర్ ప్రధానిని చూసి నేర్చుకోండి. దేశానికి ఏది అవసరమో గుర్తించండి. రాజకీయాలు పక్కన పెట్టి కరోెనాని అరికట్టండి అంటూ రాహుల్ సింగపూర్ ప్రధాని వీడియతో ఒక ట్వీట్ వేశారు. కానీ ప్రభుత్వం ఆలస్యంగా సీరియస్ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా మూడో దశకు చేరింది. ఆలస్యంగా అయినా మన వాళ్లు గట్టిగా మేల్కొన్నారు. కాకపోతే ఇప్పటికే రాహుల్ ఊహించినట్లు మన దేశపు ఎకానమీ కుప్పకూలింది.