నోరు పారేసుకుని టార్గెట్‌గా మారిన నేహా ధూపియా

August 05, 2020

       నేహా ధూపియా తన అందాల ఆరబోతతో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది. వయసు పెరగడం, వంపుసొంపుల్లో గ్లామర్ తగ్గడం, కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో క్రమంగా వెండితెర నుంచి కనుమరుగైంది. ఇప్పుడు టీవీ షోలు చేసుకుంటూ కాలం బాగానే గడుపుతోంది. `నో ఫిల్టర్ విత్ నేహా` ప్రోగ్రాం బుల్లితెరపై ఆమెను ఓ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుతం `రోడీస్ రెవల్యూషన్` ప్రోగ్రామ్‌లో నేహ ఓ టీమ్‌కు లీడర్‌. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఆ ఛానల్‌ గురువారం విడుదల చేసింది. ఓ కన్సెస్టెంట్.. తన గర్ల్‌ఫ్రెండ్ చేసిన మోసం గురించి ఆ ప్రోమోలో వివరిస్తాడు. తనతో డేటింగ్‌ చేస్తున్న సమయంలోనే మరో ఐదుగురితోనూ ఆమె డేటింగ్ చేసిందని, కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టానని చెబుతాడు. ఆ మాటలు విన్న నేహా ధూపియా ఆగ్రహంతో ఊగిపోతుంది.

నువ్వు అలా చేయడం కరెక్ట్‌ కాదు, ఎవరితో డేటింగ్ చేయాలన్నది ఆ అమ్మాయి ఇష్టం, అడగడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది. ఆమె ఎంతమందితో డేటింగ్ చేస్తే నీకేంటని దబాయించడంతోపాటు, మరికొన్ని అసభ్యకర పదాలనూ వాడటం ఆ ప్రోమోలో కనిపిస్తుంది.

        ఈ ప్రోమో నేహా ధూపియాకు చాలా చిక్కులు తెచ్చిపెట్టింది. నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసుకున్నారు. ఫేక్ ఫెమినిస్ట్‌ అంటూ విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి స్థానంలో ఓ అబ్బాయి ఉంటే ఇలాగే రియాక్ట్ అవుతారా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. మాటలను అదుపులో పెట్టుకోవాలంటూ అభ్యంతరకరంగా పోస్టులు కూడా చేస్తున్నారు. అనరాని మాటలు అంటున్నారు. రోడీస్‌ షోలో నేహాతో పాటు రణ్విజయ్‌ సింఘా, ప్రిన్స్‌ నరులా, రాఫ్తార్‌, నిఖిల్‌ కూడా తలో గ్రూపునకు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో గత నెలలో ప్రారంభమైంది.