వైసీపీ ఐడియా... సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్

July 05, 2020

ఎన్నికల సంఘం అత్యంత సుదీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ ను కొనసాగించడంతో గత ప్రభుత్వం విద్యార్థులకు మంజూరు చేసిన సైకిల్స్... విద్యార్థులకు చేరలేదు. మే 23న ఫలితాలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. అయితే, అప్పటి ముఖ్యమంత్రి ఫొటోలు ఆ సైకిల్స్ ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న ఆ సైకిళ్లను స్కూల్స్ ప్రారంభం అయినా కూడా కొత్త ప్రభుత్వం పంచలేదు. చాలా చోట్ల దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తంచేశారు. ఇంతకీ ఎందుకింత లేటయ్యిందబ్బా అని తరచిచూస్తే... చంద్రబాబు ఫొటో కనపడకుండా కొత్త స్టిక్కర్లు చేయించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందట. అది కూడా వీడియో బయటకు వచ్చి ట్రోల్ అయ్యింది. చీ పరువు పోతోంది... అని ఫీలయిన వైసీపీ ప్రభుత్వం కొత్త ఐడియా వేసింది. అది సోషల్ మీడియా కనిపెట్టేసి ఈరోజు ఫుల్ గా ట్రోల్ చేసింది.

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే (వైసీపీ) జొన్నలగడ్డ పద్మావతి ఈరోజు విద్యార్థినులకు సైకిళ్లను పంచారు. అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలపై జగన్ ఫొటోలు అతికించిన ఆ ఐడియా సక్సెస్ కాకపోవడంతో అసలు ఆ ఫొటోలు ఉన్న బుట్టనే తొలగిస్తే పాయె కదా అని ఈ ఎమ్మెల్యే గారికి ఐడియా వచ్చింది. అంతే... టకటకా సైకిళ్లకు ఉన్న బుట్టలన్నీ పీకేసి విద్యార్థులకు పంచేసింది. ఈ పొటో సోషల్ మీడియాకు చిక్కడంతో నెటిజన్లు ఫుల్ గా చేశారు. అయినా... బుట్టలు పీకేస్తే విద్యార్థులు పుస్తకాలను ఎక్కడ పెట్టుకోవాలని బాధపడుతున్నారు. గతంలో యూపీలో ప్రభుత్వం మారినా పాత ప్రభుత్వం సిద్ధం చేసిన సైకిళ్లను యోగి అలాగే పంచారు. అందువల్ల పార్టీకి ఒరిగే నష్టమేం లేదు. ఇంకా మంచి హృదయం అని వైసీపికి అభినందనలే వస్తాయి. కానీ ఇలాంటి సిల్లీ ఐడియాల వల్ల జనం ఏకుతున్నారు. 

ఒక నెటిజన్ దీని గురించి వ్యాఖ్యానిస్తూ... బుట్ట పీకేశావు బానే ఉంది... అసలు పార్టీ గుర్తే సైకిల్ కదా, ఇపుడెలా అంటూ సెటైర్ వేశారు.

మరో నెటిజన్... ’’ప్రజా వేదికను పికేసినొల్లు బుట్టి పీకలేరా రామ... ఇంకా ఏమి ఏమి పీకుతారో‘‘ అని వ్యాఖ్యానించారు.