వెయ్యికి దగ్గర్లో తెలంగాణ... ఏపీలో ఆగని వ్యాప్తి

August 11, 2020
CTYPE html>
ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని ఘోరమైన పరిస్థితి. వాస్తవానికి ఎన్నో అభివృద్ధి దేశాల కంటే మిన్నగా తెలంగాణ సర్కారు స్పందిస్తోంది. అయినా కొత్త కేసులు రావడం మాత్రం ఆగడం లేదు. ఈరోజు 56 కేసులు వచ్చాయి. 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వెయ్యికి దగ్గర్లో ఉంది తెలంగాణ. ముఖ్యంగా హైదరాబాదు, సూర్యపేట జిల్లాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
మంగళవారం సూర్యపేటలో 26 కొత్త కేసులు వచ్చాయి. హైదరాబాదులో 19 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిజామాబాద్ -3, గద్వాల-2, ఆదిలాబాద్ - 2, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 928 కి చేరింది. ఈరోజు కోలుకున్న వారితో కలిపి మొత్తం 194 మంది కోలుకోగా,  23 మరణాలు తెలంగాణ లో సంభవించాయి.
ఏపీలో 35 కొత్త కేసులు నమోదవగా... మొత్తం సంఖ్య 757కి చేరింది. కేవలం 96 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో కర్నూలు (184) గుంటూరు (158) జిల్లాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు 22 మంది మరణించారు. నిన్న ఏపీ 5022 శాంపుల్స్ ని పరీక్షించింది. 
దేశం మొత్తంగా చూస్తే 1329 కొత్త కేసులు నమోదయ్యాయి. 44 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గింది. మొత్తం కేసుల సంఖ్య 18985కి చేరింది. రేపటితో 20 వేల మార్కు ఇండియా దాటనుందని అర్థమవుతోంది. కోలుకునే రేటు విదేశాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు 3260 మంది కోలుకున్నారు. ఇది మొత్తం కేసుల్లో 17 శాతం కంటే ఎక్కువ.