ఇండియా లో ఈరోజు కొత్త కేసులు - ఆశను తగ్గించాయి !

June 05, 2020

కేంద్రం ఆశించింది జనం ఊహించింది జరగలేదు. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్రంలో కూడా ఆందోళన  పెరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే తగ్గినా... సుమారు 20 రోజుల లాక్ డౌన్ తర్వాత కొత్త కేసులు పుడుతున్నాయంటే... లాక్ డౌన్ లోను సంక్రమణం ఉన్నట్టే. లాక్ డౌన్ నేపథ్యంలోను కొత్త కేసులు సంక్రమణం ఎలా జరుగుతోంది అని కేంద్రం ఆందోళన చెందుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అత్యధిక కేసులు అక్కడే నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా... ఈరోజు ఒక్కరోజే దేశ్యాప్తంగా 34 మంది కోవిడ్ తో చనిపోయారు. మొత్తం ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య 8356 గా ఉంది.

కొత్త కేసులు రావు అనుకున్న తెలంగాణలోను కొత్త కేేసులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ మూడో దశోకి వెళ్లలేదు. అన్నీ ట్రేసింగ్ చేయదగిన కేసులే నమోదయ్యాయి. కేసులు విదేశాల నుంచి వచ్చిన వారితోనో, ఢిల్లీ మర్కజ్ మసీదు సదస్సుతో ఏదో ఒకదానితో లింకు ఉన్నాయి.  మొత్తం ఈరోజు తెలంగాణలో కొత్త కేసులు నిన్నటితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. 28 కొత్త కేసులు, 2 కొత్త మరణాలు నమోదు కాగా తాజాగా 7 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు 531 అయినా... యాక్టివ్ కేసులు 412గా ఉన్నాయి. కంటైన్ మెంట్ జోన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా దృష్టిపెట్టింది. ఇక ఏపీలో కూడా ఈరోజు కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 420గా నమోదయ్యాయి. గుంటూరులో 7 కేసులు, నెల్లూరులో 4, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కడపలో ఒక్కొక్క కేసు బయటపడింది. ఏపీలో బయట ఉమ్మివేస్తే ఈరోజు నుంచి జరిమానాలు విధించనున్నారు. అలాగే మొత్తం జనాభాకు ఒక్కొక్కరికి 3 మాస్కులు చొప్పున ప్రభుత్వం ప్రజలందరికీ పంచాలని ఆదేశించింది.