కొత్త గొడవకు కారణమైన నాగబాబు

September 16, 2019

దేశంలో ఉన్న సమస్యలు చాలవని... నేతలు వారి చదువులు అన్న దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖులు కావడానికి విద్యార్హత కచ్చితంగా ఉండాలనేం లేదు. ప్రజల పట్ల ప్రేమ, ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ ఉంటే చాలు... కానీ మోడీ, స్మృతి ఇరానీ వంటి వాళ్లు తమ చదువుల గురించి అబద్ధాలు చెబుతున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. ఎక్కువ చదివి తక్కువ చెబితే పర్లేదు గాని... చదవనిది చదివినట్లు చెబుతున్నారు. అంతకుముందు ఎన్నికల్లో పెద్ద చదువులు చదివినట్లు చెప్పిన స్మృతి ఇరానీ ఈసారి తూచ్...నేను అంత చదువుకోలేదని నేరుగా ఎన్నికల సంఘానే మోసం చేసింది.
ఇక మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తాను పెద్దగా చదువుకోలేదని బహిరంగంగా ప్రకటించారు. అఫిడవిట్లో కూడా తాను ఇంటర్ వరకే చదివానని ప్రకటించారు. తనకు చదువు అబ్బలేదు అని స్పష్టంగా చెప్పేశారు. ఇంతవరకు బానే ఉంది గాని... పవన్ చదువు గురించి కొందరు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. ఎట్టకేలకు పవన్ అఫిడవిట్లో ప్రకటించడంతో ఆ చర్చ అంతటితో ముగిసింది.
అయితే, మళ్లీ ఆ గొడవను నాగబాబు రాజేశాడు. సొంత అన్నే గొడవ పెట్టడం ఏంటనుకుంటున్నారా... సందర్భం వేరు. కాకపోతే అలా కనెక్టయిపోయింది. నాగ‌బాబు తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. ఇంట‌ర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యామ‌న్న కార‌ణంగా సూసైడ్ చేసుకోవ‌టాన్ని త‌ప్పు ప‌డుతూ ప్ర‌త్యేక వీడియోను విడుద‌ల చేశారు నాగ‌బాబు. యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా సందేశాన్ని ఇచ్చిన నాగ‌బాబు.. త‌ల్లిదండ్రుల తీరుపై, మన విద్యా వ్యవస్థపై విమ‌ర్శ‌లు చేశారు. త‌మ‌ను ఏనాడు మా త‌ల్లిదండ్రులు చ‌ద‌వాల‌ని ఒత్తిడి చేయ‌లేద‌న్నారు. కానీ ఇంటా బయటా పిల్లలపై ఒత్తిడి పెరిగి వారు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబ చదువులను ప్రస్తావించారు. చిరంజీవి డిగ్రీపూర్తి చేశార‌ని.. త‌మ ఇద్ద‌రు సిస్ట‌ర్స్ లో ఒక‌రు ఎంబీబీఎస్.. మ‌రొక‌రు డిగ్రీ పూర్తి చేశార‌న్నారు. ప‌వ‌న్ ఇంట‌ర్ పూర్తి చేశాక‌.. ఐటీలో డిగ్రీ హోల్డ‌ర్ గా చెప్పుకొచ్చారు. జనం మిగతా అంతా మరిచిపోయి... ఈ పాయింటును పట్టుకున్నారు. అదేంటి నాగబాబు... మీ తమ్ముడు ఇంటర్ చదివానని చెబితే నువ్వు ఐటీలో డిగ్రీ అంటావు. ఎందుకు మాకీ కన్ఫ్యూజన్ అని ట్రోల్ చేస్తున్నారు.
నాగ‌బాబు గారు... ఇప్పటికే మీ త‌మ్ముడి క్వాలిఫికేషన్ల గురించి తికమక పడుతున్నాం. నువ్వు ఇలా కొత్త డౌట్లు తేమాక అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.