కేంద్రం సంచలనం - విద్యా విద్యానంలో సమూల మార్పులు

August 11, 2020

కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పేరు మాత్రమే కాదు, అనేక సంచలన నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 

30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యావిధానం దేశంలోప్రవేశపెట్టనున్నారు.

5వ తరగతి వరకు కచ్చితంగా మాతృభాషలోనే విద్యను అందించే నిబంధన పెట్టునున్నట్టు సమాచారం. 

దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావడంలో భాగంగా నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు కొత్త విధానం రూపొందించారని సమాచారం.

ఈ విద్యా విధానం 5+3+3+4 విధానంలో ఉండనుంది. అంటే ఐదో తరగతి వరకు ఒకటి, ఎనిమిదో తరగతి వరకు ఒకటి 11వ తరగతి వరకు ఒకటి...

ఆ తర్వాత 4 ఏళ్ల డిగ్రీ చదువు. 10+2 స్థానంలో ఈ కొత్త విద్యా విధానం అమలులోకి రానుంది.

3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానం రూపొందించింది.

కొత్త విద్యా విధానంలో సిలబస్ కూడా మారనుంది. వృత్తి, ఉపాధి లభించే విధంగా నూతన విద్యా విధానం రూపొందించనున్నారు.  

మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. 

కొత్త విధానం అమలు చేయడానికి ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనుంది. 

మరికాసేపట్లో నూతన విద్యా విధానం పై పూర్తి స్పష్టత తో వివరాలు విడుదల చేయనున్నారు.